PM Modi and Yogi : అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన ఎన్నో ఏళ్ల కల. దీని కోసం పలు కేసులు, పోరాటాలు చేశారు. ఏళ్లుగా కష్టపడ్డారు. చివరకు కల సాకారమైంది. దేశం మొత్తం పులకించింది. నేడు జరిగిన రాముడి ప్రాణప్రతిష్టతో ప్రతి ఒక్కరు సంతోషించారు. దీని వెనుక ప్రధాని మోదీ వ్యూహం, సీఎం ఆదిత్య నాథ్ ఆచరణ రెండు కలిసి ఉన్నాయి. ఇద్దరు కలిసి ప్రజల్లో మంచి ప్రోత్సాహాన్ని నింపారు.
రామజన్మభూమి అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చింది బీజేపీనే. 1984లో ఇందిరాగాంధీ హత్య తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 414 సీట్లు కైవసం చేసుకుంది. బీజేీ రెండు స్థానాలు మాత్రమే గెలుచుకుంది. మళ్లీ 1989లో సాలంపూర్ లో అయోధ్య రామమందిరం నిర్మాణానికి కట్టుబడి ఉంటామని బీజేపీ ప్రకటించింది. అప్పుడు 85 స్థానాలు గెలిచింది. 1990లో అద్వానీ సోమ్ నాథ్ ఆలయం వరకు రథయాత్ర చేసి బీజేపీకి ఊపు తీసుకొచ్చారు. 1991లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 121 సీట్లు సొంతం చేసుకుంది.
1992లో బాబ్రీ మసీదు కూల్చివేశారు. 1995లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 161 స్థానాలు గెలుచుకున్న అతిపెద్ద పార్టీగా అవతరించినా రెండు వారాల్లోనే ప్రభుత్వం కూలిపోయింది. ఇక 1998లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 182 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఎక్కువ కాలం నిలవలేదు. 1999-2004 వరకు వాజ్ పేయి నాయకత్వంలో కొనసాగింది.
2014లో 282, 2019లో 303 సీట్లు సాధించి 2024లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. కాశ్మీర్, అయోధ్య అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి వాటి సాకారానికి శ్రీకారం చుట్టారు. 2024లో 400 సీట్లపై బీజేపీ గురిపెట్టింది. దీని కోసమే రామమందిరం కలను సాకారం చేసుకుంది. ప్రధాని మోదీ వ్యూహం, యోగీ ఆచరణతో వారి కలను నిజం చేసుకున్నారు.