PM Modi Advice to Students : ప్రస్తుతం పరీక్షల కాలం. మార్చి నుంచి పరీక్షలు నిర్వహిస్తుంటారు. పది, ఇంటర్, డిగ్రీ, పీజీలతో పాటు పలు కోర్సులకు ఎగ్జామ్స్ రాస్తుంటారు. కొందరు విద్యార్థులు పరీక్షలంటే భయపడతారు. మరికొందరు ధైర్యంతో రాస్తారు. బాగా రాసే వారికి మంచి మార్కులు రావడం సహజం. బాగా రాయని వారికి మార్కులు తక్కువ వస్తుంటాయి. ఈ నేపథ్యంలో పరీక్షలు రాయడం ఓ సవాలుగానే గుర్తిస్తున్నారు.
ఈ మేరకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులకు పరీక్ష పే చర్చ అనే కార్యక్రమం చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఏడవ ఎడిషన్ నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనే విద్యార్థులను కూడా కేంద్ర విద్యాశాఖ ఎంపిక చేసింది. నవోదయ, సైనిక్, ఏకలవ్య, కేంద్రీయ, ప్రైవేటు స్కూళ్లల్లో చదివే విద్యార్థులను ఈ కార్యక్రమానికి ఎంపిక చేశారు.
పరీక్షల సమయంలో మార్కులు, ర్యాంకుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తేవడం మంచిది కాదు. పరీక్షలు అంటే భయం లేకుండా ఏదో సరదాగా వెళ్లి రాసి వచ్చినట్లు ఉండాలి కానీ వారిపై ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదు. పరీక్షలు అంటే భయం లేకుండా చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ప్రధాని ఉద్ఘాటించారు. దేశ భవిష్యత్ ను తీర్చిదిద్దే ఇలాంటి కార్యక్రమాలు అవసరమని పేర్కొన్నారు.
పరీక్ష పే చర్చ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. విద్యార్థులు భయం లేకుండా పరీక్షలు రాసి మంచి భవిష్యత్ పొందాలనేదే దీని ముఖ్య ఉద్దేశం. విద్యావ్యవస్థను మార్చేందుకు ప్రధాని కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు.