PM Kisan funds Released : పీఎం కిసాన్ నిదులు విడుదల
PM Kisan funds Released : రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం అనేక పథకాలను అమలు చేస్తున్నది. ఈ పథకాలతో ప్రభుత్వం రైతులకు ఆర్థిక ప్రయోజనాలను కల్పి్స్తున్నది. దీనిని రైతులు వారి ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి ఉపయోగించుకుంటున్నాడు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్కీమ్.
ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు ఏటా ఆరు వేల రూపాయలు అందజేస్తున్నది. ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకోసారి విడుదల చేస్తున్నది. ప్రభుత్వం ఇప్పటి దాకా 14 విడుతలుగా సాయం మంజూరు చేసింది. బుధవారం 15వ విడత సొమ్ము కూడా రైతుల ఖాతాల్లో జమచేసింది.
కిసాన్ అధికారిక వెబ్సైట్ ప్రకారం, ప్రభుత్వం 8 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. అదే సమయంలో 15వ విడత డబ్బులు చాలా మంది రైతుల ఖాతాల్లోకి చేరలేదు. బదిలీకి సంబంధించి రైతుల రిజిస్టర్డ్ ఫోన్లో మెసేజ్ వచ్చి ఉండాలి. ఈ మొత్తం డీబీటీ ద్వారా బదిలీ చేసింది .
అలాగే పలువురి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని తెలుస్తున్నది. దీనికి కారణం ఏమిటనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. పీఎం కిసాన్ ఏఐ చాట్ బాట్లో రైతులు పీఎం కిసాన్ స్కీమ్కు సంబంధించిన ఏ ప్రశ్ననైనా సులభంగా అడగవచ్చు.
ఐదు వేర్వేరు భాషల్లో సమాధానాలను పొందవచ్చు. ఈ సదుపాయం మంగళవారం ప్రారంభమైంది. పీఎం కిసాన్ యాప్ ద్వారా దీన్ని పొందొచ్చు. -కేవైసీ, ల్యాండ్ వెరిఫికేషన్ చేయించుకున్న రైతులకు మాత్రమే ఈ పథకం ప్రయోజనం చేకూరుతుంది. ఒకవేళ వెరిఫికేషన్ చేయకపోయి ఉంటే సదరు రైతు ఖాతాలో పీఎం కిసాన్ డబ్బులు జమ కావని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు మోసాలను నిరోధించేందుకు ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. దీంతో ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య తగ్గింది.
చాలా మంది రైతులు ఈ పథకానికి అర్హత సాధించకపోయినా ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ-కేవైసీ, ల్యాండ్ వెరిఫికేషన్ ను తప్పనిసరి చేసింది.