YS Sharmila :ఏపీలో ఎన్నికల వేళ సీఎం జగన్ కు ఆయన సోదరి రష్మిలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖాస్త్రాన్ని సంధించారు. ఆ లేఖలో నవరత్నాలు సరే.. మాకు ఉన్న నవ సందేహాలకు సమాధానం చెప్పు అన్నయ్య అంటూ పేర్కొన్నారు.
‘‘ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధుల దారి మళ్లింపు వాస్తవం కాదా..? సాగు భూమినిచే్చ కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు..? 28 పథకాలను అర్థంతరంగా ఎందుకు ఆపేశారు..? ఎస్సీ, ఎస్టీలకు పునరావాస కార్యక్రమం ఎందుకు నిలిచిపోయింది..? విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు..? ఎస్సీ, ఎస్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎందుకు సీట్లు నిరాకరించారు..? ఎస్సీ, ఎస్టీలపై రాష్ట్రంలో దాడులు పెరిగాయి.. ఇది మీ వివక్ష కాదా..? డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారు..? స్టడీ సర్కిల్లకు నిధులివ్వకుండా ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు..?’’ అని షర్మిల లేఖలో ప్రశ్నల వర్షం కురిపించారు.