Pawan Kalyan : పవన్ కల్యాన్ తో రియాల్టీ షో ప్లాన్ చేశారా? ఎందులో వస్తుంది? ఏంటా కథ?
Pawan Kalyan : డిజిటల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతున్నది. ప్రేక్షకులకు కావాల్సినంద వినోదాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా అందిస్తున్నది. కొత్తగా వస్తున్న ఓటీటీ ప్లాట్ ఫామ్ లు అటు పెద్ద సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు చేస్తూ టాలెంట్ కు పెద్ద పీట వేస్తు్న్నది. కరోనా తర్వాత ప్రేక్షకుల వైఖరిలో కూడా పెను మార్పులు వచ్చాయి. ఎప్పటికీ ఆ పెద్ద తెర మీదనే కాదు… చేతిలో ఉండే సెల్ఫోన్ లోనూ కొత్త తరహ కంటెంట్ ను ఇష్ట పడుతున్నాడు.
బుల్లి తెర అంటే సిరీయళ్లలో నటించే వారు, యాంకర్లు మాత్రమే కాదని స్పష్టమైంది. బిగ్ బీ నుంచి ఇప్పుడిప్పుడే వస్తున్న హీరోల దాకా టీవీల్లోనూ, ఓటీటీ ల్లో కొత్త కొత్త షో లతో ఆకట్టుకున్నారు. డిజిటల్ మీడియాలో తమకూ అవకాశం కావాలని కోరుతున్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితమే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతితో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక అక్కడి నుంచి షారూఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ తదితర టాప్ హీరోలు హోస్టింగ్ చేస్తున్నారు.
ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, ఎన్టీఆర్, నాని, రానా, మంచు లక్ష్మి తదితరులు హోస్టింగ్ చేశారు. నాగార్జున, బాలకృష్ణ, రానా చాలా బాగా సక్సెస్ అయ్యారు.
పవన్ కల్యాన్ సైతం..
పవన్ కల్యాన్ సైతం ఓ రియాల్టికి షోకు ఒప్పుకున్నాంటే ఆశ్చర్యపోక మానదు. దివంగత రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీ రావు పవన్ కల్యాన్ తో ఓ షో చేయించాలనుకున్నాడు. ఇందుకు వపన్ తో చర్చలు కూడా జరిపారు. అయితే కేవలం ఎంటర్టైన్ మెంట్ అంటే తాను చేయనని స్పష్టం చేశాడు పవర్ స్టార్. హిందీలో స్టార్ హీరో అమిర్ ఖాన్ చేసిన సత్యమేవ జయతే లాంటి సామాజిక బాధ్యత గల షో లాంటిదని చెప్పడంతో పవన్ మరోమాట అనకుండా ఓకే చెప్పేశాడు. ప్రజోపయోగార్థం తాను సిద్ధమని చెప్పాడు. అయితే పవన్ ఇటు రాజకీయాల్లోకి వెళ్లడంతో ఈ షో కార్యరూపం దాల్చలేదు. పవన్ కల్యాణ్ చేస్తే ఎంతో మంచి పేరువస్తుందని రామోజీ రావు అనుకున్నారు. కానీ రామోజీ నెరవేరని కలల్లో ఒకటిగా ఉండిపోయింది. ఇదే తరహాలో ఓ టీవీ చానెల్ బతుకు జట్కా బండి ప్రోగ్రాం వచ్చింది. ఇది కొంత మంది సమస్యలను కొంత మేర తీర్చగలిగింది.