Pithapuram Ground Report : తాను పోటీ చేసేందుకు పిఠాపురం మినహా అనుకూలమైన నియోజకవర్గం లేదని పవన్ కల్యాణ్ గ్రహించినట్లుంది. ఈ నియోజకవర్గంలో కాపు జనాభాను పరిగణనలోకి తీసుకొని ఆయన ఆ సీటును ఎంచుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ, ఆయన ఓడిపోవడం ఖాయమని గ్రౌండ్ రిపోర్టులు చెబుతున్నాయి.
అందుకు గల కారణాలు..
* ఈ నియోజకవర్గంలో కాపులు కులం ఆధారంగా ఓట్లు వేయరు. గత ఎన్నికలే ఈ విషయాన్ని రుజువు చేశాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన కాపు నేత దొరబాబును కాదని కాపులతో సహా మెజారిటీ ప్రజలు రాజు సామాజిక వర్గానికి చెందిన స్వతంత్ర అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మకు ఓటు వేయడంతో 47 వేల ఓట్ల తేడాతో దొరబాబు ఓడిపోయారు.
మళ్లీ 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభంజనం కొనసాగుతున్న సమయంలో దొరబాబు టీడీపీ అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మపై గెలిచినా.. 15 వేలకు మించి మార్జిన్ ఓట్లు రాలేదు. జనసేన అభ్యర్థి శేషుకుమారి కేవలం 28 వేల ఓట్లు మాత్రమే సాధించి మూడో స్థానంలో నిలిచారు.
* ఈ నేపథ్యంలో ఎస్వీఎస్ఎన్ వర్మ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే పవన్ ఓటమి దాదాపు ఖాయమని స్థానిక ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ వర్మ చంద్రబాబు ఆలోచనకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ కు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నా మెజారిటీ ఓటర్లు చీలిపోతారు కాబట్టి ఆయన ఓడిపోవచ్చు, వర్మకు మాత్రమే ఓటు వేయాలని అనుకుంటున్నారు తప్ప ఆయన మద్దతిచ్చే వ్యక్తికి ఓటు వేయరు.
* వర్మ వైసీపీలో చేరితే పవన్ కళ్యాణ్ భవితవ్యం అగమ్యగోచరంగా మారుతుంది.
* పైగా పవన్ కళ్యాణ్ కు పోల్ మేనేజ్‌మెంట్, ఎన్నికల ప్రచారంలో అంతగా అనుభవం లేదు. అభ్యర్థులకు బలమైన గ్రౌండ్ ఫోర్స్, పార్టీ మండల స్థాయి, పంచాయతీ స్థాయి సభ్యుల మధ్య సమన్వయం అవసరం. అది లేకుండా తమ పార్టీకి గానీ, తమ ప్రధాన నాయకుడికి గానీ భారీ వేవ్ వస్తే తప్ప ఏ అభ్యర్థి గెలవలేడు. పాలకొల్లులో చిరంజీవి ఓటమి పాలయ్యారు.
* పవన్ కళ్యాణ్ కు టీడీపీ మద్దతిస్తుందని భావించినప్పటికీ, ఆయన ఒకసారి అధికారంలోకి వస్తే తమ ప్రాంతంలో లోతుగా పాతుకుపోతారని, తమ భవిష్యత్ కు సవాల్ విసురుతారని భావించి ఆ పని చేయడం లేదు.
కాబట్టి ఏ రకంగా చూసినా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయమని క్షేత్రస్థాయి విశ్లేషణలు చెబుతున్నాయి.