Pinnelli Ramakrishna : అనూహ్యంగా దొరికిపోయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి – పారిపోయేందుకు యత్నించి విఫలం

Pinnelli Ramakrishna
Pinnelli Ramakrishna : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటీషన్ ని ఈ రోజు 2.45 ప్రాంతంలో హైకోర్టు కొట్టేసింది. అయితే హైకోర్ట్ ఆదేశాలు తెలుసుకున్న పోలీసులు, వెంటనే పిన్నెల్లిని అరెస్ట్ చేయటానికి బయలుదేరారు. పోలీసులు తనని సాయంత్రం లోపు అరెస్ట్ చేస్తారని తెలిసిన పిన్నెల్లి, చెన్నై పారిపోవటానికి ప్లాన్ వేస్తున్నారు.
అయితే 2.45 గంటలకు హైకోర్టు ఆదేశాలు రాగానే, 2.57 గంటలకే పోలీసులు పిన్నెల్లి ఇంటిని చుట్టుముట్టారు. ఈ పరిణామంతో ఖంగుతిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి, వెంటనే పారిపోవటానికి ప్రయత్నించారు.
పక్కనే ఉన్న బాత్ రూమ్ లోకి ఇద్దరూ ఒకేసారి వెళ్లి బాత్ రూమ్ తలుపులు వేసుకున్నారు. ఎంత సేపటికీ బయటకు రాకపోవటంతో, పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోపలకి వెళ్ళగా, అప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకటరామిరెడ్డి బాత్రూమ్ కిటికీలో నుంచి పారిపోయాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం ఎంత ప్రయత్నం చేసినా పారిపోయేందుకు కుదరక, పోలీసులకు దొరికిపోయాడు.
సినీ ఫక్కీలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులకు దొరికిపోయాడు. లేకపోతే ఈ పాటికి, గతంలో లాగా ఏ చెన్నై, హైదరాబాద్ కో పారిపోయే వాడు.