Pinnelli Ramakrishna : జైలు నుంచి విడుదలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

Pinnelli Ramakrishna
Pinnelli Ramakrishna : మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. ఎన్నికల సమయంలో ఆయనపై నమోదైన ఈవీఎం ధ్వంసం సహా మరో రెండు కేసుల్లో ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన శనివారం (ఆగస్టు 24) ఉదయం నెల్లూరు జైలు నుంచి విడుదలయ్యారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి బయటకు రాగానే అక్కడ వేచి ఉన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం వారు అక్కడి నుంచి కారులో బయలుదేరి వెళ్లారు. వాస్తవానికి శుక్రవారం రాత్రే ఆయన విడుదల కావాల్సి ఉంది. అయితే కోర్టు నుంచి జైలు అధికారులకు అందాల్సిన కాపీలు ఆలస్యమవ్వడం, సమయం మించిపోవడంతో ఆయనను జైలు అధికారులు రిలీజ్ చేయలేదు.