Chandrababu : చంద్రబాబుపై కేసులను సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిల్

Cases against Chandrababu

Chandrababu

Cases against Chandrababu : ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు నేతృత్వంలో సజావుగా సాగిపోతోంది. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దే ప్రయత్నంలో చంద్రబాబు బిజీ అయిపోయారు. ఈక్రమంలో పోలవరం, అమరావతి వంటి కీలక అంశాలపై ఆయన దృష్టి సారించారు. ఈమేరకు విభజన సమస్యల పరిష్కారానికి పీఎం మోదీని కలువడమే కాదు..పక్క రాష్ట్రం సీఎంను కలిసి ఇరు రాష్ట్రాల ప్రయోజనాలపై చర్చించే పనిలో ఉన్నారు.

ఇదిలా ఉండగా ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేశ్,  పొంగూరు నారాయణ, కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రతో పాటూ టీడీపీ నేతలపై కేసుల్ని సీబీఐ, ఈడీలకు అప్పగించాలని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. వీరితో పాటుగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వ్యాపార వేత్తలు లింగమనేని రమేష్, వేమూరు హరికృష్ణ ప్రసాద్‌తో పాటూ పలు కంపెనీలపై నమోదు చేసిన కేసుల్ని అప్పగించాలని కోరారు.

చంద్రబాబుతో పాటూ ఇతరులపై స్కిల్‌ డెవలప్‌మెంట్‌, మద్యం, ఏపీ ఫైబర్‌ నెట్, అమరావతి ‌అసైన్డ్‌ భూములు, ఇసుక, అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ సహా కేసులు నమోదయ్యాయని పిల్‌లో గుర్తు చేశారు. ఈ కేసుల్లో పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేసే పరిస్థితులు లేవని.. నిష్పాక్షిక, పారదర్శక, వేగవంత దర్యాప్తు కోసం.. ఈ కేసుల్ని సీబీఐ, ఈడీలకు అప్పగించాలని సీనియర్ జర్నలిస్ట్ బాల గంగాధర తిలక్‌ ఈ పిల్ దాఖలు చేశారు. అయితే ఆ కేసులన్నీ జగన్ రెడ్డి కక్షపూరితంగా పెట్టినవని, చంద్రబాబును అణచివేసేందుకే ఆ కేసులన్నీ పెట్టారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. జగన్ అవినీతి, అసమర్థత పాలన వల్ల రాష్ట్రం దారుణంగా దెబ్బతిందని, ఆ కంతలు పూడ్చడానికి చంద్రబాబు అహోరాత్రులు కష్టపడుతున్నారని, ఆయనపై అక్రమంగా మోపిన కేసులను ఈడీకి, సీబీఐ ఇవ్వాలని పిల్ వేయడం హాస్యాస్పదమన్నారు.

TAGS