JAISW News Telugu

Pick of the Day : పిక్ ఆఫ్ ది డే: పవన్ ఫ్యామిలీ ఫొటో అదిరిందిగా..

FacebookXLinkedinWhatsapp
Pick of the Day

Pick of the Day

Pick of the Day : పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో గెలిచింది మొదలు ఆయన ఫ్యామిలీ ఆయనకు తోడుగానే ఉంటుంది. భార్య అనా లెజెనోవా అయితే తన భర్త పవన్ కళ్యాణ్ ని ఎంతో ప్రేమగా చూసుకుంటోంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అకీరాను పక్కనే ఉంచుకుంటున్నాడు. మోడీ దగ్గరకు వెళ్లినా అకీరాతో కలిసే వెళ్లారు. జూన్ 4 ఎన్నికల ఫలితాల రోజు నుంచి పవన్ డిప్యూటీ సీఎం గా కేసరపల్లిలో ప్రమాణస్వీకారం చేసేవరకు భార్య అనా లెజినోవా, పిల్లలు అకీరా, ఆద్యలు ప్రతిసారి హైలెట్ అవుతూనే ఉన్నారు.

ఇదిలా ఉంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అనా లెజినోవా, పిల్లలు అకీరా నందన్, ఆద్యలతో కలిసి దిగిన బ్యూటీఫుల్ ఫొటోను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. జూన్ 12న ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణం చేసిన తర్వాత క్లిక్‌మనిపించిన ఫొటో ఇదని జనసేన పార్టీ పేర్కొంది. ప్రమాణ స్వీకారం తర్వాత  మంగళగిరిలోని వారి ఇంటికి బయల్దేరామనుకుంటే.. ట్రాఫిక్‌ కారణంగా ఇబ్బందులు తలెత్తాయని, దీంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపిన పవన్ కళ్యాణ్.. కాసేపు సేదతీరారని జనసేన పార్టీ తెలిపింది. ఈ సమయంలోనే భార్య అనా లెజినోవా, పిల్లలు అకీరా, ఆద్యలతో తీసుకున్న ఫొటో ఇది అంటూ అందమైన ఫొటో వెనుక ఉన్న నేపథ్యాన్ని వెల్లడించారు.
 
జనసేన పార్టీ ట్విట్టర్లో పోస్ట్ చేసిన కాసేపటికే ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇందులో  అకీరా నందన్, ఆద్య సైతం సంప్రదాయ దుస్తుల్లో కనిపించడం విశేషం. రోడ్డు పక్కన చెట్ల నీడ కింద దిగిన ఈ ఫొటోను చూసి జనసైనికులు తెగ మురిసిపోతున్నారు. ట్రాఫిక్ ఉందని ఇబ్బంది పడుతూ కార్లోనే కూర్చొనే బదులు.. వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి కాసేపు ఫ్యామిలీతో సేదతీరడం చూస్తుంటే ప్రతి ఆటంకాన్ని మన విజయానికి సోపోనాలుగా మార్చుకోవచ్చని పవన్ ఫ్యామిలీ చెబుతున్నట్లు ఉందని ఆయన అభిమానులు పేర్కొన్నారు.

Exit mobile version