Pic Talk : గౌతమ్ ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ పై ఇన్ స్టాలో నమ్రత ఏం రాసిందంటే?

Pic Talk

Pic Talk Mahesh Babu Family

Pic Talk : సూపర్ స్టార్ మహేశ్ బాబు కొడుకు గౌతమ్ ఫస్ట్ స్టేజ్ షోతో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారని ఆయన తల్లి నమ్రతా శిరోద్కర్ గర్వంగా చెప్పారు. గౌతమ్ యాక్టింగ్ లో తమనే మించిపోతాడని హర్షం వ్యక్తం చేసింది. ఇన్నాళ్లు సితార ముందు తెరంగేట్రం చేస్తుందని అనుకంటున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పుడు గౌతమ్ వస్తాడా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన కుమారుడు గౌతమ్ ఘట్టమనేనితో కలిసి లండన్ లో జరిగిన ఓ నాటకానికి హాజరయ్యేందుకు కొంత సమయం తీసుకున్నారు.

లండన్ లోని యూనికార్న్ థియేటర్ లో నిన్న (జూన్ 22) జరిగిన గౌతమ్ నాటకం ‘రోమియో జూలియట్ అండ్ ఎత్’ను వీక్షించిన అనుభవాన్ని మహేష్ సతీమణి నమ్రత తన ఇన్ స్టాలో సగర్వంగా పంచుకున్నారు. ప్రదర్శన అనంతరం నమ్రత, మహేష్ తదితరులు చిరునవ్వులు చిందించారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన అందమైన ఫొటోలను నమ్రత పోస్ట్ చేస్తూ.. ‘ఇంత ప్రత్యేకమైన సాయంత్రం కాబట్టి గౌతమ్ ఘట్టమనేని గురించి చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. లండన్ లో తన తొలి స్టేజ్ పర్ఫార్మెన్స్, అది ఎంత చక్కటి ప్రదర్శన నచ్చింది!! నిన్ను మరింత ప్రేమించాను నాయనా. పిల్లలందరూ జాయ్ ఆఫ్ డ్రామాతో ఈ చిన్న సమ్మర్ ప్రోగ్రామ్ కు హాజరై వారి అంతరంగాన్ని అన్వేషించాలి!! స్పెషల్ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో అద్భుతమైన సాయంత్రం.. సంతోషం కలిగించినందుకు కృతజ్ఞత.’ అంటూ రాసుకుంది. ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ కావడంతో ఘట్టమనేని కుటుంబం త్వరలోనే ఇండియాకు తిరిగి రానుంది.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

TAGS