Photo War : రాజకీయాలకు దేవుడికి కూడా సంబంధాలున్నాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం కూడా ఎన్నికల నినాదంలో భాగంగా చేసుకోవడం గమనార్హం. తాజాగా కాంగ్రెస్ నేత శశి థరూర్ బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ పై ఓ ఆరోపణ చేశారు. సంజయ్ రాముడి ఫొటో ఫ్రేములను పంపిణీ చేస్తున్నారంటే సామాజిక మాధ్యమం ఎక్స్ లో ట్వీట్ చేయడం సంచలనం కలిగించింది.
దీనిపై బండి సంజయ్ కూడా సరైన సమాధానమే ఇచ్చారు. తాను ఫొటో ఫ్రేములు పంపిణీ చేసింది ఎన్నికల కోడ్ రాకముందు. ఫిబ్రవరిలో చేశాను. ఇప్పుడు కోడ్ వచ్చిన తరువాత మాత్రం అలా చేయలేదు. దీనికి కట్టుబడి ఉన్నానని చెప్పుకొచ్చారు. కావాలంటే ఎన్నికల కోడ్ వచ్చాక పంపిణీ చేసినట్లు నిరూపిస్తే దేనికైనా రెడీ అని ఆయన రాసుకొచ్చారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రతీ హిందువు కల. దాని కోసం చాలా మంది తపించారు. కానీ ఆ కార్యక్రమాన్ని కాంగ్రెస్ బహిష్కరించింది. మరి ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుతుంది? అని సంజయ్ థరూర్ కు ప్రశ్నించారు. కాంగ్రెస్ వారు ఇలాంటి చౌకబారు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. మంచి చేస్తే మెచ్చుకోవాల్సింది పోయి విమర్శలేల అని మొట్టికాయలు వేశారు.
దేశంలో ప్రస్తుతం మోదీ హవా వీస్తోంది. ప్రధానిగా మోదీకే పట్టం కడతారని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ మాత్రం పగటి కలలు కంటోంది. నాయకత్వానికి సరైన బలం, దిశా నిర్దేశం లేకున్నా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం పనికి రాదనే కామెంట్లు వస్తున్నాయి. ఈనేపథ్యంలో బీజేపీ గాలిని తట్టుకోవడం కాంగ్రెస్ వల్ల అయ్యే పని కాదని తేలిపోయింది.
ప్రపంచంలోనే మేటి నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గుర్తింపు లభించింది. దేశాన్ని సురక్షితంగా ఉంచడంలో బీజేపీకి ఏది పోటీ రాదు. కాంగ్రెస్ కు పాలించే సత్తా లేదు. కాంగ్రెస్ పాలనను ప్రజలు చూశారు. ఉగ్రవాదం, అల్లర్లు చెలరేగి భారతదేశం అల్లకల్లోలంగా మారుతుంది. అదే బీజేపీ అయితే ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటుందని సగటు ఓటరు నమ్ముతున్నాడు.