Suma Family Celebrations : సుమ ఫ్యామిలీ ఫోటో చూసారా.. రాజీవ్ బర్త్ డే, దీపావళీ సెలెబ్రేషన్స్.. ఇక రచ్చ రచ్చే!
Suma Family Celebrations : సుమ కనకాల అంటే చిన్న పిల్లలకు కూడా తెలిసిపోతుంది. ఈమె అంతలా తన పాపులారిటీ పెంచుకుంది. టాలీవుడ్ లో స్టార్ యాంకర్ గా దశాబ్దానికి పైగానే రాణిస్తున్న ఈ భామకు చిన్న వాళ్ళ నుండి పెద్ద వాళ్ళ వరకు అన్ని వయసుల వారు ఫ్యాన్స్ ఉన్నారు.. సుమ బేసిక్ గా మలయాళీ..
కానీ తెలుగు వాళ్ళ కంటే కూడా చక్కగా తెలుగు మాట్లాడుతూ ఇక్కడే సెటిల్ అయ్యింది. టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని యాంకర్ గా స్థిర పడిన విషయం విదితమే.. సుమ తమ పర్సనల్ లైఫ్ లోని విషయాలను సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు పంచుకుంటూ ఫ్యాన్స్ కు ఫాలోవర్స్ కు దగ్గరగా ఉంటుంది.
కాగా యాంకర్ సుమ తాజాగా తన భర్త రాజీవ్ పుట్టిన రోజును గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసింది. రాజీవ్ కనకాల పుట్టిన రోజుతో పాటు దీపావళీ పండుగ కూడా ఒకే రోజు రావడంతో గ్రాండ్ గా కుటుంబం మొత్తం కలిసి సెలెబ్రేట్ చేసుకున్నట్టు తెలుస్తుంది.. ఈ వేడుకకు సంబంధించిన పిక్స్ సుమ నెట్టింట షేర్ చేసింది.
రాజీవ్ కనకాల తో ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కేక్ కట్ చేయించి పుట్టిన రోజు వేడుకను సందడిగా మార్చారు.. ఈ సెలెబ్రేషన్స్ కు సంబంధించిన వీడియో, ఫోటోలు సుమ ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.. ఈ వీడియోలో సుమ రాజీవ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ హగ్ చేసుకోగా రాజీవ్ సుమతో మరో హగ్ కావాలని అడగడం అందరిని ఆకట్టు కుంటుంది.
బర్త్ డే వేడుక ముగిసిన తర్వాత దివాళీ సెలెబ్రేషన్స్ కూడా జరిగాయి.. ఈ పిక్స్ నెట్టింట వైరల్ కాగా నెటిజెన్స్ ఈ పిక్స్ పై కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యామిలీ మొత్తం కలిసి కనిపించడమే మాకు కూడా కావాలి అంటూ సుమ ఫ్యామిలీ పై మెసేజ్ చేస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram