Jaipal Yadav : ఫోన్ ట్యాపింగ్ సంగతి తెలియదు: జైపాల్ యాదవ్
Jaipal Yadav : ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత జైపాల్ యాదవ్ జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరయ్యారు. రెండు గంటల పాటు విచారించి అతని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. విచారణ అనంతరం జైపాల్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
‘‘ఓ వివాదం పరిష్కారం కోసం తిరుపతన్నను కలిశాను. ఆయన మా సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో కలిశా. రెండు కుటుంబాల మధ్య విభేదాల కేసులో 2 ఫోన్ నంబర్లు ఇచ్చా. తిరుపతన్న ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేయించాననే ఆరోపణలతో నాకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ రెండు ఫోన్ నంబర్లను ట్యాపింగ్ చేసిన సంగతి నాకు తెలియదు. పోలీసులు నా ముందు కొన్న ఆధారాలు పెట్టి వివరణ అడిగారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను. ఈ కేసులో ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరిస్తా’’ అని తెలిపారు.