Phone Tapping : ఏపీలో కూడా ఫొన్ ట్యాపింగ్.. త్వరలో విచారణ జరిపిస్తా: లోకేష్ బాబు
Phone Tapping in AP : ఆంధ్రప్రదేశలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని దీనిపై త్వరలో కేసు వేసి విచారణ జరిపిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. పెగాసిస్ సాఫ్ట్ వేర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై తమ దగ్గర కచ్చితమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలోనే ఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభిస్తామని లోకేష్ వెల్లడించారు.
కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్వవహారం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉంటే…. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారంటూ ఈసీని ఆశ్రయించింది తెలుగుదేశం పార్టీ. ఈ విషయమై ఆపిల్ సంస్థ పంపిన సెక్యూరిటీ అలెర్ట్ విషయాన్ని ఫిర్యాదులో ప్రస్తావించింది.