JAISW News Telugu

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. అరెస్టు వారెంట్ ఇవ్వాలని పోలీసుల పిటిషన్

Phone Tapping Case

Phone Tapping Case

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అరెస్టు చేయడానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సీఆర్పీసీ ద్వారా అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కోరారు. ప్రస్తుతం ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్నటి వరకు నలుగురు పోలీసు అధికారులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. పోలీసు కస్టడీలో వారు చెప్పిన వివరాల ఆధారంగా ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ప్రభాకర్ రావు ఉన్నట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. కేసు నమోదైన వెంటనే ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. ఎక్కడ ఎయిర్ పోర్టులో దిగినా పట్టుకునేందుకు వీలుగా ఇప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. రెడ్ కార్నర్ నోటీసు, ఇంటర్ పోల్ అధికారులను దర్యాప్తు బృందం సంప్రదించాలంటే కోర్టు అనుమతించాల్సి ఉంటుంది.

Exit mobile version