YCP : వైసీపీ కార్యకర్తల అరెస్టులపై హైకోర్టులో పిటిషన్లు.. కాసేపట్లో విచారణ

YCP Petitions

YCP Petitions on High Court

YCP Petitions : వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై హైకోర్టులో వరుస పిటిషన్లు దాఖలయ్యాయి. దాదాపు 8 లంచ్ మోషన్ పిటిషన్లు ఫైల్ కావడంతో ఇన్ని ఎందుకు దాఖలవుతున్నాయని న్యాయమూర్తి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో పోలీసుల అక్రమ నిర్బంధాలపై వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. పదుల సంఖ్యలో హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై శుక్రవారం ఉదయం న్యాయస్థానం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ఒకేసారి భారీ మొత్తంలో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటూ ప్రశ్నించింది. విచారణకు రావాలని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ను ఆదేశించింది.

వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు జింకాల రామాంజనేయులు, తిరుపతి లోకేష్, మునగాల హరీశ్వరరెడ్డి, నక్కిన శ్యామ్, పెద్దిరెడ్డి సుధారాణి-వెంకటరెడ్డి దంపతులు, మహమ్మద్ ఖాఝాభాషాలను పోలీసులు నిర్బంధించారు. పోలీసుల నిర్బంధపై బాధితుల కుటుంబ సభ్యులు హైకోర్టు మెట్లెక్కారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేశారు.