MP Vijayasai : విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ ఎంపీ విజయసాయి పిటిషన్

MP Vijayasai
MP Vijayasai : విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నవంబరు 15 నుంచి 30 వరకు అమెరికా, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. విజయసాయి పిటిషన్ పై అభ్యంతరం వ్యక్తం చేసిన సీబీఐ, అనుమతి ఇవ్వొద్దని కోర్టుకు విన్నవించింది. అయితే, ట్రయల్ కోర్టు గతంలో విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 8 వరకు తీర్పును రిజర్వ్ చేసింది.