Telangana : తెలంగాణలో ‘పర్మిట్’ పంచాయితీ మళ్లీ మొదటికి..

Telangana

Telangana

Telangana : దేశంలోనే లిక్కర్ సేల్స్ లో అగ్రస్థానంలో ఉన్నది తెలంగాణ రాష్ర్టం. రాష్ర్ట ఖజానాకు ప్రధాన ఆదాయ వనరు మద్యం అమ్మకాలు కావడం గమనార్హం.  ఒక్క రోజు మద్యం సేల్స్ ఆగినా రాష్ర్ట ఖజానాకు పెద్ద మొత్తంలో గండిపడినట్లే. ఏటేటా తెలంగాణ రాష్ర్టంలో లిక్కర్ సేల్స్ విపరీతంగా పెరుగుతుండగా, అదే స్థాయిలో రాష్ర్ట ఖజానా గలగలలాడుతున్నది. ఒక వేళ తెలంగాణలో మద్యం అమ్మకాలు నిలిపివేస్తే ఎన్నో సంక్షేమ పథకాలు అప్పటికప్పటి ఆగిపోయే పరిస్థితి ఉంది. ఈ లెక్కన చూసుకుంటే తెలంగాణ ఖజానా గలగలలాడేది మద్యం అమ్మకాలపైనే ఆదారపడి ఉంది.

మద్యం టెండర్లకు పోటాపోటీ
తెలంగాణలో మద్యం టెండర్లు వేయడానికి తీవ్ర పోటీ నెలకొంది. మద్యం టెండర్లు వేయడానికి తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాల వారు పోటీ పడుతున్నారంటే లిక్కర్ లో ఎంత ప్రాఫిట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. గత మద్యం టెండర్లలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ పెద్ద కంపెనీ 100 కోట్లు  మద్యం టెండర్ల కోసం వెచ్చించింది. ఇది తెలంగాణ లో మద్యం వ్యాపారం ఏ రేంజ్ లో సాగుతుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ.

గల్లీ లీడర్ల నుంచి ఢిల్లీ లీడర్ల దాకా తమ పేరు మీద లేక బినామీ పేర్లతో టెండర్లు దక్కించుకొని మద్యం వ్యాపారం సాగిస్తున్నారు.  ఇక బార్ల అనుమతి కోసం రాష్ర్ట స్థాయి నేతలతో పైరవీలు చేయించుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి.  అయితే కొన్నేళ్లుగా మద్యం వ్యాపారంలో ఓ చిక్కొచ్చి పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వం మద్యం షాపులతో పాటు నిర్ణీత స్థలంలో పర్మిట్ రూమ్ లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. అయితే తినుబండారాలు పెట్టకూడదని ఆంక్షలు విధించింది. దీంతో పర్మిట్ రూముల అనుమతితో తెలంగాణ లో మద్యం సేల్స్ విపరీతంగా పెరిగాయి.  దీంతో ప్రభుత్వం వాటిని కొనసాగిస్తూ వచ్చింది.

పర్మిట్ రూమ్ లతో పంచాయితీ
పర్మిట్ రూమ్ లతో తమ ఆదాయానికి గండిపడుతున్నదని బార్ షాపుల ఓనర్లు ముందు నుంచి గగ్గోలు పెడుతున్నారు. పర్మిట్ రూములను ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే గత ప్రభుత్వం వీరిని డిమాండ్ కు అనుగుణంగా పర్మిట్ రూములలో తినుబండారాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. కానీ క్షేత్రస్థాయిలో ఆ నిబంధనలు అమలు కాకపోవడంతో బార్ షాపుల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  లక్షల రూపాలయ ఫీజలు చెల్లించి బార్లు నడుపుతున్నామని, పర్మి్ట్ రూముల కారణంగా తమ ఆదాయానికి గండిపడుతుందని, చర్యలు తీసుకోవాలంటూ  ఎక్సైజ్ శాఖను కోరుతున్నారు.   అయితే దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో  వేచి చూడాల్సిందే. 

TAGS