Illegal constructions : అక్రమ నిర్మాణాలకు అధికారుల అనుమతులు.. ఆరుగురిపై క్రిమినల్ కేసులు

Illegal constructions

Illegal constructions

Illegal constructions : అక్రమ నిర్మాణాలకు అనుమతిలిచ్చిన అధికారులపై హైడ్రా చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్ని అక్రమ భవనాలను కూల్చివేసిన హైడ్రా, వాటికి అనుమతులిచ్చిన అధికారుల లిస్టు తయారుచేస్తోంది. ఇప్పటికే ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ కు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిఫారసు చేశారు. దీంతో సైబరాబాద్ ఆర్థిక నేర విభాగంలో కేసులు నమోదయ్యాయి. నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, చందాపేట జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుదామ్ష్, బాచుపల్లి తహసీల్దార్ పూల్ సింగ్, మేడ్చల్-మల్కాజిగిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు, హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్, హెచ్ఎండీఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్ పై కేసులు నమోదయ్యాయి.

గండిపేటలో అక్రమ నిర్మాణాలకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. అందులో ఇరిగేషన్ ఎస్ఈపై చర్యలు తీసుకోవాలని ఆ శాఖకు హైడ్రా లెటర్ రాయనున్నట్లు సమాచారం. హైడ్రా కూలుస్తున్న వాటిలో కొన్నింటికి అనుమతులు లేనప్పటికీ, మరికొన్ని మాత్రం అన్ని రకాల అనుమతులు తీసుకొని నిర్మించారు. ఇలాంటి వాటికి అనుమతులిచ్చిన అధికారులపైనే చర్యలు తీసుకుంటున్నారు.

TAGS