Narayana Murthy : హాస్పిటల్ నుంచి పీపుల్స్ స్టార్ డిశ్చార్జ్.. వాళ్లను తలుచుకున్న నారాయణ మూర్తి..

Narayana Murthy

Narayana Murthy

Narayana Murthy : దర్శక, నిర్మాత, పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. నాలుగు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్ లో చేరిన నారాయణ మూర్తి  ప్రస్తుతం పూర్తిగా కోలుకొని ఇంటికి వెళ్లారు. పంజాగుట్టలోని  నిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం నారాయణ మూర్తి మీడియా తో మాట్లాడారు.  ‘భగవంతుడి దయ వల్ల  పూర్తి ఆరోగ్యంగా ఉన్న. నాకు దగ్గరుండి చికిత్స అందించిన నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తో పాటు అక్కడి డాక్టర్లకు ప్రత్యేక ధన్యవాదాలు. నా క్షేమాన్ని కోరుకున్న అభిమానులు, ప్రజా దేవుళ్లకు శిరస్సు వంచి దండం పెడుతున్న’ అని నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు. నారాయణ మూర్తి ఆరోగ్యం పరిస్థితిని నిమ్స్ వైద్యులు వెల్లడించారు.

నారాయణ మూర్తి పూర్తిగా కోలుకున్నారని చెప్పారు. ప్రస్తుతానికి నారాయణ మూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ఏ సమస్యా లేదని చెప్పారు. అయితే రెగ్యులర్ చెకప్ చేయించుకోవాల్సి ఉంటుందన్నారు.  ఈ విషయం తెలిసిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..  నారాయణ మూర్తికి ఫోన్‌ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. నారాయణ మూర్తి ఆరోగ్య పరిస్థితిపై   వైద్యులను అడిగి తెలుసుకున్నారు కేటీఆర్‌ .

ఎప్పుడు హుషారుగా ఉండే  నారాయణ మూర్తి అనారోగ్య సమస్యలతో జూలై 17న  హైదరాబాద్‌లోని నిమ్స్ వైద్యశాలలో చేరారు. ఉన్నట్లుండి ఆయన అస్వస్థతకు గురికావడంతో అభిమానులు ఆందోళన చెందారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థించారు. పలువురు సినీ ప్రముఖులు కూడా రెడ్ స్టార్ ఆరోగ్యంపై ఆరా తీశారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే  ఆర్ నారాయణ మూర్తే తన ఆరోగ్య పరిస్థితిపై స్వయంగా ఓ ప్రకటన విడుదల చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని స్పష్టం చేశారు.

ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు కూడా హెల్త్ బులెటిన్ లో  ప్రకటించారు. కొంత కోలుకున్నా కూడా నిమ్స్ డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. అలా నాలుగు రోజుల పాటు హాస్పిటల్ లో చికిత్స పొందిన నారాయణ మూర్తి ఇప్పుడు ఆరోగ్యంగా బయటకు రావడంతో  ఆయన అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.

TAGS