Minister TG Bharat : వంద రోజుల పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు : మంత్రి టీజీ భరత్

Minister TG Bharat
Minister TG Bharat : వంద రోజుల కూటమి పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులోని బుధవారంపేటలో నిర్వహించిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ప్రజల కోసం నిరంతరం కష్టపడే నాయకుడు సీఎం చంద్రబాబు అని అన్నారు. ఎన్డీయే కూటమి వంద రోజుల పాలనపై ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తమ జీవితాలను ప్రజాసేవకే అంకితం చేశారని చెప్పారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ కు పరిశ్రమలను తీసుకోస్తామని మంత్రి హామీనిచ్చారు. చంద్రబాబు సీఎంగా ఉండడం వల్లే వరదల నుంచి ప్రజలు త్వరగా బయటపడ్డారని మంత్రి భరత్ పేర్కొన్నారు.