Bhashyam Praveen : భాష్యం రాకతో పల్లెల్లో ఆనందం.. నీరాజనం పడుతున్న జనం..
Bhashyam Praveen : పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్ కు రోజు రోజుకు ప్రజల నుంచి ఆదరణ పెరుగుతోంది. ఏ గ్రామానికి, వాడలకు, వీధులకు వెళ్లినా ఆప్యాయంగా పలకరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రావాలని, గ్రామాలు బాగు పడాలని బలంగా కోరుకోవడం కనిపిస్తుంది. భాష్యంకు యూత్ లో కూడా మంచి పట్టు ఉండడంతో గ్రామాల్లోని యువకులు ఆయన వెంట నడుస్తున్నారు.
బుధవారం (ఏప్రిల్ 03) బెల్లంకొండ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. పూల మాలలతో ఆయనను స్వాగతించారు. వెంకటాయపాలెంలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నాయకులు సమావేశం నిర్వహించారు. స్థానికంగా ఉన్న సమస్యలు వాటి పరిష్కార చర్యలను వారు వివరించారు. రానున్నది టీడీపీ ప్రభుత్వమే కాబట్టి పరిష్కారం చూపిస్తానని. ప్రతీ గ్రామంలో సమస్యలను నమోదు చేసుకుంటున్నానని. విజయం తర్వాత ఒక్కొక్కటిగా చేసి తీరుతానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలోని ఆలయాలకు వెళ్లి పూజలు చేశారు.
మన్నె సుల్తాన్ పాలెంలో కూడా పర్యటించి ప్రసంగించారు. గడపగడపకు వెళ్లి ‘సూపర్ 6’ గురించి వివరించారు. ఈ ఆరింటింటినీ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచే అమలు చేస్తామని ప్రజలకు చెప్తున్నారు. భాష్యంను చూసిన, భాష్యం గురించి తెలుసుకుంటున్న స్థానికులు ఆయనతో కలిసి నడవడమే కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా కార్యకర్తలను తీసుకస్తున్నారు. అలా వందలాది మంది వైసీపీ కార్యకర్తలు భాష్యం ఆధ్వర్యంలో మహాకూటమిలో చేరారు.
పార్టీ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరినీ పార్టీ గుండెల్లో పెట్టి చూసుకుంటుందని చెప్పిన భాష్యం. చేరిన ప్రతీ ఒక్కరికీ పార్టీ కండువా కప్పి ఆప్యాయంగా పలకరించారు. చేరిన వారితో మరింత బలం పెరిగిందని విజయం దాదాపు సాధ్యమైపోయిందని, పోటీ లాంచనమే అన్నారు భాష్యం. ప్రతీ నాయకుడు, కార్యకర్తలు కలిసి పని చేస్తే ఎక్కువ మెజారిటీ వస్తుందని, అప్పుడే నియోజకవర్గానికి మరిన్ని ఎక్కువ నిధులు తెస్తానని చెప్పారు.