Varun Tej : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రజలే కుటుంబ సభ్యలని సినీనటుడు వరుణ్ తేజ్ అన్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత ఎన్నికల్లో పవన్ విజయం సాధించుకున్నా ప్రజలకు ఆయన మేలు చేస్తున్నారని అన్నారు. అప్పులు చేసి మరీ కౌలు రైతులకు సాయం చేస్తున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఆయనను గెలిపిస్తే ప్రజలకు మరింత సేవ చేసే అవకాశముంటుందని అన్నారు. ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని వరుణ్ తేజ్ కోరారు.
పిఠాపురం వచ్చిన వరుణ్ తేజ్ కు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలు ఘనస్వాగతం పలికారు. నాగబాబు, వరుణ్ తేజ్ పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామి, దత్తాత్రేయుడు, పురుహూతికా అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గొల్లప్రోలు మండలం తాటిపర్తి, కొడవలి, చెందుర్తి గ్రామాలలో బైక్ ర్యాలీ, రోడ్డు షోలో పాల్గొని, దుర్గాడలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.