JAISW News Telugu

Election Commission : వృద్దులకు ఫెన్సన్ ఇంటికెళ్లి ఇవ్వాల్సిందే.. ఈసీ

Election Commission

Election Commission

Election Commission : అర్హులైన వృద్దులకు ప్రభుత్వం ఇచ్చే నెలవారీ ఫించన్ ఇంటింటికి వెళ్లి ఇవ్వడం సాధ్యం కాదని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంకు చెందిన  కొందరు పెద్దలు మొండికేశారు. వైసీపీ తో కుమ్ముక్కైన నేతలు, కొందరు అధికారులు కలిసి  తెరలేపారు. ప్రతి నెల ఒకటో తేదీన ఇంటింటికి వెళ్లి ఇవ్వడం సాధ్యం కాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇది తెలిసి ఫింఛనుదారుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. విషయం తెలిసి ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవడంతో రాజకీయ నాటకానికి తెరపడింది.
 
ఈ రెండు నెలల కాలంలో ఫెన్షన్ ను లభిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన వారికి ఇంటికి వెళ్లి ఇస్తామని ప్రకటించింది. అందుకు సంబందించిన నిబంధనలను సైతం ప్రభుత్వం విడుదల చేసింది.వాలంటీర్లు లేరనే సాకును ప్రభుత్వం చూపించింది. తప్పించుకోడానికి ప్రయత్నం చేసింది. కానీ ఎదురుదెబ్బ తగిలింది. ఎట్టకేలకు పంపిణి చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది.

వాలంటీర్లు లేరనే విధానం సరికాదని ఎన్నికల కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. వాల్లు లేకపోతే ప్రభుత్వం వద్ద కింది స్థాయి కార్యాలయాల్లో సిబ్బంది ఉన్న విషయాన్నీ ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి గుర్తు చేసింది. దీనితో వైసీపీ తో జత కట్టిన నాయకులు, కొందరు ప్రభుత్వ పెద్దలు తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గ్రామ సచివాలయంలో ఉద్యోగులు ఉన్నారు. ప్రతి కార్యాలయంలో పదేసి మంది ఉద్యోగులు ఉంటారు. ఒక్కో సచివాలయంకు సుమారు ఐదు వందల మంది లబ్ధిదారులు ఉంటారు. వారందరికీ పంపిణి చేయాలంటే ఒక్క రోజులో పంపిణి చేయవచ్చు. ఇదేమి ఇబ్బంది కరమైన విషయం కాదు అంటూ ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి వివరించడంతో ప్రభుత్వం పెద్దలు దిగిరాక తప్పలేదు. వృద్ధుల ఫించన్ విషయాన్నీ ఎన్నికల కమిషన్ పెద్దగా పట్టించుకోదని వైసీపీ నేతలు ఊహించారు. పరిస్థితి ఎందాక వస్తుందో అని కూడా  ఆలోచించలేదు. ఈ సమయంలో ఫించన్ పంపిణి చేస్తే నిధులు సమస్య వస్తుందనే ఉద్దేశ్యంతో తప్పించుకోడానికి ప్రయత్నించినట్టు కూడా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Exit mobile version