Parthasarathy : CMO రమ్మని పిలిచినా.. స్పందించని పెనమలూరు ఎమ్మెల్యే? 

Penamalur MLA Parthasarathy

Penamalur MLA Parthasarathy

Parthasarathy : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో 175 సీట్లు కచ్చితంగా గెలవాలని లక్ష్యంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మార్పు చేర్పు లకు  శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ఎమ్మెల్యేగా కొనసాగుతూ సీనియర్లు గా ఉన్నప్పటికి పక్కనపెట్టి వేరే వాళ్లకు టికెట్లు ఇస్తుండడంతో వైసిపి అధిష్టానం పై ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. వైసిపి జెండా మోసి పార్టీ కోసం ఎంత కష్టపడి పని చేస్తే సర్వేల రిపోర్టు సరిగ్గా లేదని మమ్మల్ని మార్చే ప్రయత్నం చేస్తే సహించేది లేదని వారు హెచ్చరిస్తున్నారు.

 తాజాగా మాజీ మంత్రి, పెనమలూరు ఎమ్మెల్యే పార్ధసారధి కి CMO నుంచి పిలుపు వచ్చింది. అయినా పార్థసారథి స్పందించలేదు. టిక్కెట్ ఇవ్వలేమన్న సంకేతాలు వెలువడి నేపద్యంలో తాను cmo కు వెళ్లాల్సిన అవసరం ఏముందని పార్థసారథి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్థసారథిని బుజ్జగించేందుకు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎంపీ అయోధ్య రామిరెడ్డి… పోరంకి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్ధసారధితో భేటీ అయి. ఆయనను బుజ్జగిం చే ప్రయత్నం చేస్తున్నారు….

వైసీపీలో రాజకీయ భవిష్యత్తు లేదని తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాలని పార్థసారధి నిర్ణయించుకున్నట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికే టిడిపి నేతల తో ఆయన మంత్రాలు జరిగినట్లుగా సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతుంది. రాజకీ యంగా ఉనికి ఉండాలంటే కచ్చితంగా ఏదో ఒక పార్టీలో ఎమ్మెల్యేగా ఉండాల్సిన అవసరం ఉంది. వైసీపీలో ఆ పరిస్థితి లేనప్పు డు ఇతర పార్టీలకు ఎందుకు వెళ్ళకూడదనీ నేతలు భావిస్తు న్నారు. మొత్తం మీద ఇన్చార్జిల మార్పుతో వైసిపి లో నాయకు లందరూ కూడా బయటికి వెళ్లిపో తున్నారు. ఎన్నికల నాటికి సీనియర్ నేతలు ఎవరు కూడా పార్టీలో మిగిలిన పరిస్థితి కనపడటం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

TAGS