Pedda Vagu : పెద్దవాగు కరకట్ట పనులు ప్రారంభం

Pedda Vagu
Pedda Vagu : పెద్దవాగు కరకట్ట రిపేర్ పనులు ప్రారంభమయ్యాయి. తాత్కాలిక రిపేర్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రూ.3.50 కోట్లను మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎమ్మెల్యే జారే ఆదినారాయన ప్రాజెక్టు రిపేర్ పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పెద్దవాగె ప్రాజెక్టుకు గండిపడి తీవ్ర నష్టాన్ని మిగిల్చిన నేపథ్యంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రైతులను ఆదుకోవాలని ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లారన్నారు. ఈ వానా కాలంలోనే రైతులకు 2360 ఎకరాలకు సాగునీరు అందించి తీరుతామని స్పష్టం చేశారు. పనులు వెంటనే పూర్తిచేస్తామన్నారు. మంత్రి వెంట నాయకులు జూపల్లి రమేశ్, చిన్నంశెట్టి సత్యనారాయణ, చెన్నారెడ్డి పాల్గొన్నారు.