Pedakurapadu : టీడీపీలో చేరిన పెదకూరపాడు వైస్ ఎంపీపీ చాంద్ భాషా

Pedakurapadu

Pedakurapadu

Pedakurapadu : పెదకూరపాడు మండల కేంద్రంలో బుధవారం వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన పెదకూరపాడు వైస్ ఎంపీపీ ఎస్.కె చాంద్ భాషా తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీలో చేరిన వారికి పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని అన్నారు. చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధాని చేసి రాష్ట్ర దశాదిశా మారుద్దామనుకుంటే ఈ సైకో జగన్ మూడు ముక్కలాటలో రాజధాని పోగొట్టాడని అన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి పెదకూరపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించి, పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి నా బాధ్యతలను నిర్వర్తిస్తాను అని అన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో బ్యాలెట్ బాక్స్ (ఈవీఎం) సంఖ్య 3 సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

TAGS