Bhashyam Praveen : గ్రామాల్లో విశేష ఆదరణ.. భాష్యం ప్రవీణ్ కు జన నీరాజనం
Bhashyam Praveen : పెదకూరపాడు మహా కూటమి (టీడీపీ) అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కు జనం నీరాజనం పలుకుతున్నారు. ఏ గ్రామం వెళ్లినా.. ఏ వీధికి వెళ్లినా.. ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. కులం, మతం, వర్గం అనే తేడా లేకుండా వెంట కదిలి వస్తున్నారు. భాష్యంతోనే నియోజకవర్గం బాగు పడుతుందని అందుకు అందరం కలిసి నడవాలని ఆయా గ్రామాల నాయకులు పిలుపునివ్వడంతో ఆయన ప్రచారానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది.
యంగ్ అండ్ ఎనర్జిటిక్ లీడర్ నియోజకవర్గంలో ఉంటే అభివృద్ధి వెంటే ఉంటుందన్న ప్రజలు ప్రవీణ్ కే పట్టం కట్టాలని నిర్ణయించుకుంటున్నారు. ఇప్పటికే చాలా గ్రామాలు, పల్లెలు స్వచ్ఛందంగా తీర్మానాలు కూడా చేస్తున్నాయి. పల్లెలతో పాటు పట్టణాల్లోని యూత్ అంతా భాష్యంతో కదనరంగంలోకి దూకుతోంది. వెంట ఉండి గెలిపించుకుంటామని ఈ సారి భాష్యంను ఎమ్మెల్యేగా చూసే వరకు విశ్రమించబోమని చెప్తున్నారు.
టికెట్ అనౌన్స్ మెంట్ జరిగినప్పటి నుంచి ప్రతీ రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యటిస్తున్నారు. కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా స్థానికులు తమ దృష్టికి తీసుకచ్చిన సమస్యలను నోట్ చేసుకుంటున్నారు. గెలుపు బాటలో ఉన్నందున పరిష్కరించేందుకు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
ఈ రోజు (ఏప్రిల్ 02) పెదకూరపాడు నియోజకవర్గంలోని పెదకూరపాడు మండలం, బుచ్చయ్యపాలెం, రామాపురం,75 తాళ్లూరు, అబ్బురాజుపాలెం గ్రామాల్లో పర్యటించారు. ఈ గ్రామాల్లో వాడ వాడలా తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ‘సూపర్ సిక్స్’ గురించి ప్రజలకు వివరించారు.
అభివృద్ధి – సంక్షేమం రెండూ మీ అందరికీ అందాలంటే సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీతో పాటు జనసేన-బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామల్లో నాయకులతో నిర్వహించిన సమావేశాలకు భారీ స్పందన లభించింది. గ్రామంలోని నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తామంతా భాష్యం వెంటే ఉంటామని.. గెలిపించుకుంటామని చెప్పారు.