Bhashyam Praveen : పెదకూరపాడు ప్రాంతం చాలా ప్రశాంతమైనది – అందరూ సోదరభావంతో మెదలాలి: భాష్యం ప్రవీణ్

Bhashyam Praveen
Bhashyam Praveen : పెదకూరపాడు నియోజక వర్గం ప్రజలందరూ సోదరభావంతో మెదలాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఒక ప్రకటనలో కోరారు. దయచేసి పెదకూరపాడు నియోజకవర్గానికి చెందిన ప్రజలు, అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు కోపాలు, రాగద్వేషాలు లేకుండా ఉండాలని అన్నారు.
అందరూ సోదర భావంతో మెలిగి మన పెదకూరపాడు ప్రాంత ప్రశాంతతను కాపాడాలని ఆయన కోరారు. పెదకూరపాడు ప్రాంత అభివృద్ధి కోసం మాత్రమే మనమంతా ముందు ఉండాలని భాష్యం ప్రవీణ్ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
TAGS ap politicsBhashyam PraveenPedakurapaduPedakurapadu ConstituencyTDPTDP Janasena BJPTDP MLA candidate Bhashyam Praveen