JAISW News Telugu

KTR : తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయి : కేటీఆర్

KTR

KTR

KTR : తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వం పోలీసులను స్వేచ్ఛగా పనిచేయనివ్వడం లేదని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తో కలిసి బాగ్ అంబర్ పేటలోని సాయిబాబా కాలనీలో ఇటీవల హత్యకు గురైన విశ్రాంత బ్యాంకు మేనేజర్ లింగారెడ్డి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. లింగారెడ్డి దంపతుల హత్య ప్రతి ఒక్కరిని కలచివేసిందన్నారు. పట్టపగలు వృద్ధ దంపతులను కిరాతకంగా హత్య చేశారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పనిచేయని సీసీ కెమెరాలను మరమ్మతు చేయించాలని, అది చేతకాకపోతే తామే బాగు చేయిస్తామని తెలిపారు. తక్షణమే హోంశాఖ మంత్రిని నియమించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

Exit mobile version