Payal Rajput : 21 ఏళ్లకే చెయ్యకూడని పనులు చేశాను అంటూ పాయల్ రాజ్ పుత్ షాకింగ్ కామెంట్స్!

Payal Rajput's shocking comments

Payal Rajput’s shocking comments

Payal Rajput : కేవలం ఒకే ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల్లో ఎప్పటికీ మర్చిపోలేని రేంజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు మన ఇండస్ట్రీలో. కానీ కొంతమంది హీరోయిన్స్ కి అదే చివరి బెస్ట్ చిత్రం అయ్యిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి వారిలో ఒకరు పాయల్ రాజ్ పుత్. అజయ్ భూపతి దర్శకత్వం లో తెరకెక్కిన ‘ఆర్ ఎక్స్ 100’ చిత్రం ద్వారా ఈమె ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

ఆ సినిమాలో నెగటివ్ రోల్ లో నటించి తన సత్తా చాటింది. అయితే ఆమె చేసిన నెగటివ్ రోల్ అవకాశాలకు కూడా గండిపడేలా చేసిందని కొంతమంది విశ్లేషకులు అంటూ ఉంటారు. ఎందుకంటే నెగటివ్ రోల్ లో ఒక్కసారి ఒక హీరోయిన్ కి ముద్ర పడితే ప్రేక్షకులు అదే దృష్టితో చూస్తారు. పాయల్ రాజ్ పుత్ ని చూస్తే మన అందరికీ ఆమె పోషించిన ఆ నెగటివ్ రోల్ గుర్తుకు వస్తూంటాది.

ఆ సినిమా తర్వాత కూడా ఆమెకి అన్నీ అదే తరహా బోల్డ్ పాత్రలు రావడం వల్ల అన్నీ వర్గాల ప్రేక్షకులకు దగ్గర కాలేకపోయింది. కానీ రీసెంట్ గా విడుదలైన ‘మంగళవారం’ చిత్రం మాత్రం పాయల్ రాజ్ పుత్ కి మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో కూడా ఆమె బోల్డ్ రోల్ లోనే కనిపించింది కానీ, ఆమె పాత్రపై జనాల్లో సానుభూతి కలుగుతుంది. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యినప్పటికీ కూడా పాయల్ రాజ్ పుత్ కి అనుకున్న స్థాయిలో ఆఫర్స్ రావడం లేదు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తన చిన్న వయస్సులో జరిగిన సంఘటనల గురించి చెప్పుకొచ్చింది.

21 ఏళ్ళ వయస్సులో మీరు ఎలా ఉండేవారు అని ఒక యాంకర్ అడగగా, దానికి పాయల్ రాజ్ పుత్ సమాధానం చెప్తూ ‘ఆ వయస్సులో ఎవరైనా చదువుకుంటూ ఉంటారు, లేదా ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉంటారు. కానీ నేను చూడండి ఏమి చేస్తున్నానో. అప్పట్లోనే సినిమా అవకాశాల కోసం ఫోటో షూట్స్ చేస్తున్నాను’ అంటూ తన 21 ఏళ్ళ వయస్సులో తీసుకున్న ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో క్యూట్ గా కనిపించిన పాయల్ రాజ్ పుత్ ని చూసి ఆమె ఫ్యాన్స్ ఎంతగానో మురిసిపోతున్నారు.

TAGS