Jagan Tweet : పవన్ కుమారుడికి ప్రమాదం.. జగన్ ట్వీట్ వైరల్

Jagan Tweet : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం కలకలం రేపింది. ఈ ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని ఓ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడని తెలియగానే పలువురు ఆందోళన చెందారు. ఈ విషయంపై వైఎస్ జగన్ కూడా వెంటనే స్పందించారు. “ఈ ప్రమాదంలో పవన్ కుమారుడు గాయపడ్డాడని తెలిసి షాకయ్యాను. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా” అని ఆయన తన X ఖాతాలో పేర్కొన్నారు.

TAGS