Pawan Fourth Wife : పవన్ నాలుగో పెళ్లాం..ఫొటోలు వైరల్
Pawan Fourth Wife : తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన జెండా సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సభలో పవన్ ప్రసంగం జనసేన, టీడీపీ కార్యకర్తలకు గూస్ బంప్స్ తెప్పించిందనడంలో సందేహం లేదు. అలాగే ఆయన చేసిన కొన్ని కామెంట్స్ అందరినీ నవ్వించాయి కూడా. సభలో జగన్ గురించి చేసిన కామెంట్స్ ను టీడీపీ, జనసేన క్యాడర్ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నాయి.
పవన్ సభలో మాట్లాడుతూ.. జగన్ తనకు నలుగురు పెళ్లాలు అంటున్నారని, బహుషా నా నాలుగో పెళ్లాం జగనే కావొచ్చు అని నవ్వులు పూయించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండగా, వీటితో పాటు పవన్ నాలుగో పెళ్లి ఫొటోలు అని ఫొటోతో కూడిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు నవ్వులు పూయిస్తూ షేర్ చేస్తుండడంతో పాటు మా అన్నను జాగ్రత్తగా చూసుకో నాలుగో ఒదినా, పెళ్లి సంప్రదాయబద్ధంగా జరిగిందని, మీరు సుఖంగా ఉండాలని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
పవన్ పెళ్లిళ్లపై నిత్యం జగన్ కామెంట్స్ చేస్తుండడం మనకు తెలిసిందే. దీనికి పవన్ గట్టి కౌంటరే ఇచ్చాడని విశ్లేషకులు అంటున్నారు. అలాగే ఇతరుల భార్యలను పెళ్లాలు అంటూ సంబోధించడంపైనా పవన్ కామెంట్ చేశారు. జగన్ భార్య భారతిని తాము ఎప్పుడైనా అలా కామెంట్ చేశామా? తమకు సభ్యత ఉందని జగన్ ను ఉద్దేశించి మాట్లాడారు. కాగా, పవన్ కౌంటర్ తర్వాత జగన్ ఇక పెళ్లాల విషయం తీసేందుకు వెనకాడవచ్చని అంటున్నారు.
పెళ్లికీ కూడా పిలవలేదు. సర్లే సర్లే ఏనేనో అనుకుంటాం, మా ఆన్న నీ బాగా చూసుకో నాలుగో వొదిన ❤️🥰 pic.twitter.com/HwI5THxBep
— Sandhya Reddy YSCRP 🇺🇿 (@SandhyaSamayam) February 28, 2024