Pawan : శ్రీవారిని దర్శించుకున్న పవన్.. ప్రాయశ్చిత్త దీక్ష విరమణ

Pawan in tirumala
Pawan in Tirumala : ఏపీ డిప్యటీ సీఎం పవన్ కల్యాన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన కుమార్తెలు ఆద్య, పొలెనా అంజన, దర్శకుడు త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. గొల్ల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ అధికారులు పవన్ కు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత ఆయన తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లి పరిశీలించారు.
తిరుమల లడ్డూ కల్తీ నేపథ్యంలో పవన్ ఇటీవల పవన్ ఇటీవల ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. 11 రోజుల పాటు దీక్షను కొనసాగించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి మంగళవారం సాయంత్రం తిరుపతి చేరుకున్న ఆయన, అలిపిరి మెట్ల మార్గం నుంచి కాలినడకన తిరుమలకు వచ్చారు.