JAISW News Telugu

Pawan-Chiranjeevi : అన్నయ్య దగ్గరకు తమ్ముడు.. మెగా ఫ్యామిలీలో అంబరాన్నంటిన సంబరాలు..పులకించిపోయిన అభిమానులు

FacebookXLinkedinWhatsapp
Pawan-Chiranjeevi

Pawan Kalyan – Chiranjeevi

Pawan-Chiranjeevi : మెగా అభిమానులకు నేడు పర్వదినం. పవన్ అద్భుత విజయం సాధించడంతో కొణిదెల వారింట సంబరాలు అంబరాన్నంటాయి. ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచాక పవన్ కల్యాణ్ తొలిసారిగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు కుటుంబ సభ్యులంతా గ్రాండ్ వెల్ కం పలికారు. ఈ విజువల్స్ చూసిన మెగా అభిమానుల గుండెలు ఉప్పొంగిపోయాయి. మాటల్లో వర్ణించలేని తన్మయత్వం చెందారు అందరూ.

పవన్ కల్యాణ్, భార్య, కొడుకు అకిరాతో కలిసి ఢిల్లీ నుంచి నేరుగా అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. అద్భుత విజయం సాధించిన పవన్ కు అద్భుతరీతిలో ఆహ్వానం పలికేందుకు చిరంజీవి ఇంటా ఏర్పాట్లు చేశారు. పవన్ కారు చిరంజీవి గేటు దగ్గరకు రాగానే భారీగా తరలివచ్చిన మెగా ఫ్యాన్స్ పువ్వులతో స్వాగతం పలికారు. పవన్ కారు గేటులోకి రాగానే నాగబాబు..పవన్ పూలు చల్లుతూ స్వాగతం పలికారు. అనంతరం రామ్ చరణ్ వచ్చి పవన్ హత్తుకుని స్వాగతం పలికారు. ఇంటి ద్వారం వద్దకు రాగానే మెగా కుటుంబ సభ్యులంతా ఆహ్వానం పలుకుతుండగా… పవన్ అన్నయ్య చిరంజీవి దగ్గరికి వెళ్లి పాదాభివందనం చేశారు. చిరంజీవి తమ్ముడిని లేపి ఆప్యాయంగా గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. గొప్ప విజయం సాధించిన పవన్ ను ప్రేమగా ముద్దుపెట్టుకున్నారు.

ఆ తర్వాత చిరంజీవి పవన్ భార్య, కొడుకు అకిరాను ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్ వచ్చి బాబాయ్ పవన్ కు పాదాభివందనం చేశారు. ఇక ఆ తర్వాత తల్లి, వదిన సురేఖ, సోదరిలు పవన్ కు దిష్టి తీసి స్వాగతం పలికారు. ఆ తర్వాత పవన్ తల్లికి, వదిన సురేఖకు పాదాభివందనం చేసి ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత తల్లి అంజనాదేవి, వదిన సురేఖలతో  పవన్ కేక్ కట్ చేయించారు. ఈ దృశ్యాలు చూస్తూ మెగా అభిమానులు పులకించిపోయారు. మెగా ఇంటా సంబరాల్లో రామ్ చరణ్ భార్య ఉపాసన, వరుణ్ తేజ్, సాయితేజ్..ఇలా మెగా ఫ్యామిలీ అంతా పవన్ గెలుపుపై సంబరాలు జరుపుకున్నారు. కాగా…కొణిదెల వారి సంబరాల దృశ్యాలు, వీడియోలు సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. ఇది కదా మెగా ఫ్యామిలీ అంటే అని ఫ్యాన్స్ అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version