JAISW News Telugu

Pawan to Delhi : పవన్ ఢిల్లీకి.. ‘పొత్తు రాజకీయం’ కొలిక్కి వచ్చినట్టేనా..మరేదైనా మలుపు తీసుకుంటుందా?

Pawan to Delhi..

Pawan to Delhi..

Pawan to Delhi : ఏపీలో పొత్తుల రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రమంత్రి అమిత్ షాతో నిన్న రాత్రి భేటీ అయ్యారు. ఏపీలో 2014 పొత్తులు రిపీట్ కావడం దాదాపు ఖాయమే. ఈసమయంలోనే ఢిల్లీ నుంచి పవన్ కు పిలుపు వచ్చింది. బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. సీట్ల పంపకాలపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. సీట్ల గురించి ఒక నిర్ణయానికి వస్తే మూడు పార్టీల నుంచి ఉమ్మడి ప్రకటన చేయనున్నారు.

ఏపీ రాజకీయాలు ఢిల్లీకి చేరాయి. చంద్రబాబు మరోసారి ఎన్డీఏలో చేరడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ ఇవాళ ఢిల్లీలో బీజేపీ చీఫ్ నడ్డాతో సమావేశం కానున్నారు. ఈ సమయంలో ఏపీలో పొత్తులు.. సీట్ల సర్దుబాబు గురించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.  అలాగే ఉమ్మడి ఎజెండా, మ్యానిఫెస్టో అంశాలపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. నేడు లేదా రేపు టీడీపీ ఎన్డీఏలో చేరికపైన అధికారికంగా ప్రకటన చేసే చాన్స్ ఉంది.

జనసేనకు ఇప్పటికే 25-27 అసెంబ్లీ సీట్లు ఖాయమైనట్టు సమాచారం. రెండు ఎంపీ స్థానాలు ప్రతిపాదించినా మూడో స్థానంగా అనకాపల్లి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని సమాచారం. ఇదే సమయంంలో బీజేపీ 8 ఎంపీ, 25 అసెంబ్లీ సీట్లు కోరినట్టు తెలుస్తోంది. చంద్రబాబు 5 ఎంపీ స్థానాలు, 15 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.  దీనిపై బీజేపీ నుంచి ఎలాంటి ఆమోదం రాలేదని చెబుతున్నారు. బీజేపీ, జనసేనకు కలిపి 10 ఎంపీ, 50 అసెంబ్లీ సీట్లు ఇచ్చేలా పవన్ తో బీజేపీ ముఖ్యనేతలు చర్చలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసి అమిత్ షాను కలువనున్నట్లు చెబుతున్నారు.

ఇక అప్పుడే అమిత్ షాతో పొత్తులు, సీట్ల పంపకం ఫైనల్ చేస్తారని అంటున్నారు. అలాగే టీడీపీ ఎన్డీఏ చేరిక, పొత్తు ప్రకటన చేస్తారని సమాచారం. వీరి భేటీతో ఇక ఏపీ ఎన్నికల రాజకీయాలు ఓ కొలిక్కి వచ్చినట్టే అని తెలుస్తోంది. పొత్తులు, సీట్ల ప్రకటన తర్వాత ఉమ్మడిగా ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నారు.

Exit mobile version