Pawan Speech : ట్రెండింగ్ లో పవన్ స్పీచ్.. జనాల గుండెలను పిండేస్తూ ఆలోచింపజేస్తోంది..

Pawan Speech

Pawan Speech

Pawan Speech : ఏపీలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. పార్టీల అధినేతలు ప్రచారంలో బిజీబిజీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రసంగాలపై ప్రత్యేక దృష్టిపెడుతున్నారు. ఈక్రమంలో పవన్ ప్రసంగాలు జనాలను ఉర్రూతలూగించడమే కాదు వారిలో ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. ‘‘పదహేడేళ్ల బాలుడిని ఫ్రాన్స్ లో పోలీసులు కాల్చి చంపితే ఆ దేశం అట్టుడికి పోయింది. అదే పదహేడేళ్ల పిల్లవాడిని కులన్మోదంతో ఓ రెడ్డి కుటుంబానికి చెందిన వ్యక్తి పెట్రోల్ పోసి కాల్చి చంపితే మన దగ్గర కదలిక రాలేదు.

స్వయంగా చనిపోయే ముందు వాంగ్మూలం ఇచ్చినా.. ఆ బీసీ బిడ్డ అక్కపైనా.. కుటుంబంపైనా నిందలు వేసి వికటాట్టహాసం చేశారు. నిందితులు కొద్ది రోజుల్లోనే బెయిల్ తెచ్చుకుని ఆ కుటుంబాన్ని బెదిరిస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. జగన్మోహన్ రెడ్డికి కొద్దిగా గీసుకపోతేనే ఏపీ ప్రజలకు జరిగిన గాయమంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.’’ అంటూ జనసేనాని పవన్ తెనాలిలో ఇచ్చిన ప్రసంగం ప్రతీ ఒక్కరి గుండెను తడుముతోంది.

బీసీ బిడ్డను కాల్చి చంపినప్పుడు గాయం కాలేదా? రేపల్లె రైల్వే స్టేషన్ లో భర్త ముందే మహిళను మానభంగం చేస్తే దొంగతనం కోసం వచ్చి పొరపాటున చేశారని ఓ మంత్రే అనడం గాయం కాలేదా? అంటూ పవన్ సంధించిన ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇద్దరు చెల్లెళ్లు బాబాయిని చంపేశారని గొంతు చించుకుంటుంటే ఒక్క పోలీస్ అధికారి మాట్లాడడు. సీబీఐ వస్తే కడప కోటలోకి రానివ్వరు..ఇంతటి దారుణాలు జరుగుతుంటే ఎవరికీ పట్టదు..అంటూ ఆవేశంగా ప్రశ్నించారు.

రాష్ట్రం గంజాయి కేంద్రంగా మారిపోయింది.. పోలీస్ స్టేషన్లు రౌడీలకు అడ్డాగా మారిపోయాయి..ఎన్ని ఘోర ఘటనలు జరిగినా ఒక్కరికీ గాయం కాలేదు. తప్పు జగన్ ది కాదు.. మనదే..జగన్ ఆధ్వర్యంలో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల ఇసుక మొత్తం దోచేశారు..ఎందరో బీసీ, ఎస్సీ, ఎస్టీల పొట్టలు కొట్టి ఒక్కరికే దోచిపెట్టారు..మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్ రెడ్డి సారా వ్యాపారిగా మారిపోయాడు అంటూ పవన్ ఆవేదన అందరినీ ఆలోచింపజేస్తోంది.

పవన్ ప్రసంగాన్ని విన్న ఎవరికైనా మనం ఏం కోల్పోయామో..రాజకీయాలు, కులం మత్తులో ఎంత బానిసలుగా మారామో అర్థమవుతుంది. మాములుగా రాజకీయ సభలో ప్రసంగం అనుకుని చాలా మంది తీసుకుంటారు కానీ ఈ ప్రసంగం మాత్రం పొలిటికల్ స్పీచ్ లలో ది బెస్ట్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ స్పీచ్ విన్నవారు ఎవరికైనా ఓటు ఎవరికీ వేయాలో కచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు.

TAGS