Chandrababu as CM : సీఎంగా చంద్రబాబు పేరును ప్రతిపాదించిన పవన్.. బలపరిచిన ఎన్డీయే కూటమి

Chandrababu as CM
Chandrababu as CM : 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఈనెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో సమావేశమైన కూటమి శాసనసభాపక్ష నేతలు చంద్రబాబు సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీఎంగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురలు పురందేశ్వరి బలపరిచారు.
కూటమి తరపున సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ ప్రజలు గత ఐదేళ్లుగా విధ్వంస పాలన చూశారని, ఈ ఎన్నికల్లో 57 శాతం మంది ప్రజలు కూటమికి ఓటేసి గెలిపించారని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ఎప్పుడూ నిలబెట్టుకుంటామని అన్నారు.