Pawan Kalyan : సినీ పరిశ్రమలో తన కోస్టా స్టార్స్ తో పోటీపై జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు.తాను ఎవరినీ పోటీ గా భావించనని , అందరూ బాగుండాలనేదే తన అభిమతమని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించిన ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో ఏపి డిప్యూటీ సీఎం మాట్లాడారు. గ్రామీణ కుటుంబాలకు కనీసం 100 రోజుల పని కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల జీవితాలు మెరుగుపరిచేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు.
పల్లెలు పట్టణాలనే తేడా లేకుండా అన్నిచోట్ల సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్లు, ప్రహారీలు, స్కూళ్లలో రూఫ్ టాప్స్, తాగు నీటిఎద్దడి నివారణ, పారిశుధ్య నిర్వహణతో పాటు ఇతర 30వేల అభివృద్ధి పనులు చేపట్టేందుకు పల్లె పండుగ వారోత్సవాల్లో శంకుస్థాపన చేసి సంక్రాంతి లోగా పూర్తి చేస్తామని చెప్పారు.
పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఓజీ.. ఓజీ అంటూ నినాదాలు చేశారు.దీంతో పవన్‌కల్యాణ్ స్పందించారు.
‘‘ఇన్నాళ్లూ మీరు(అభిమానులు) ‘ఓజీ.. ఓజీ..’ అంటుంటే నాకు ‘మోదీ.. మోదీ’ అని వినిపించేదన్నారు. వినోదం అందరికీ కావాల్సిందేనని అన్నారు. ఈ పల్లె పండగ ఎందుకు చేస్తున్నామో వెల్లడించారు. అభిమాన హీరోల సినిమాలకు వెళ్లాలంటే… టికెట్లు కొనుక్కోవాల్సి ఉంటుందని,..దానికి చేతిలో డబ్బులు ఉండాలన్నారు పవన్ కల్యాణ్. వినోదం కన్నా ముందు ప్రతీ ఒక్కరి కడుపు నిండాలన్నారు. అందుకే ముందు కడుపు నింపే పనికి సంకల్పించామని చెప్పారు. ముందు రోడ్లు, స్కూళ్లు బాగు చేసుకుందామని… ఆ తర్వాతే విందులు.. వినోదాలన్నారు.
ఇండస్ట్రీలో ఉన్న తనకు హీరోతోనూ ఇబ్బంది లేదన్నారు. తాను ఎవరితోనూ పోటీపడబోనని స్పష్టం చేశారు. ఒక్కో హీరోకు ఒక్కో టాలెంట్ ఉందన్నారు. తాను అందరూ బాగుండాలనే కోరుకునే వ్యక్తినని చెప్పారు. బాలకృష్ణ, చిరంజీవి, మహేశ్‌బాబు, తారక్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, నాని, ఇతర హీరోలందరూ బాగుండాలని కోరుకుంటానన్నారు. మీ అభిమాన హీరోలకు జై కొట్టేలా ఉండాలంటే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగుండాలన్నారు. ఇక ముందు దానిపై దృష్టి సారిద్దామని చెప్పారు. పవన్ పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడంతో అభిమానులు మరింతగా చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు.