Pawan Kalyan:జమ్ము – కశ్మీర్‌ను భారతదేశంలో సంపూర్ణంగా విలీనం చేయాలని కలలుగన్న భారత ప్రజలందరికీ… తాజాగా సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు మరో విజయంగా జనసేన భావిస్తోందని అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. దేశ ప్రజలందరూ సంతోషంగా వేడుకలు జరుపుకొనే మధుర క్షణాలు ఇవి అని, భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు ఏకగ్రీవంగా సమర్థిస్తూ ఇచ్చిన తీర్పు పట్ల జనసేన హర్షాతిరేకం వ్యక్తం చేస్తోందని పవన్ స్పష్టం చేశారు.
సుప్రీం కోర్టు ఈ తీర్పు ద్వారా ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగపరంగా చెల్లుబాటేనని ధృవీకరించిందని, ఈ నిర్ణయం దేశ సమగ్ర ఐక్యత, పురోగతికి ఒక ముఖ్యమైన పరిణామం అని ఆయన అన్నారు. అతి పెద్ద లౌకిక దేశమైన భారత్ సాధించిన విజయంగా దీనిని జనసేన పరిగణిస్తోందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.