Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచార షెడ్యూల్ ఖరారు

Pawan Kalyan
Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 20న పిఠాపురం నుంచి పర్యటన ప్రారంభించి 22 రోజుల పాటు ప్రచారం కొనసాగించనున్నారు. 21న భీమవరం, నర్సాపురం, 22న తాడేపల్లిగూడెం, ఉంగుటూరు ప్రచార సభల్లో పాల్గొంటారు. 23న పిఠాపురంలో నామినేషన్ వేసి, అనంతరం పలు బహిరంగ సభల్లో పాల్గొంటారు. 24న రాజేంపేట, రైల్వేకోడూరులో టిడిపి అధినేత చంద్రబాబుతో కలిసి ప్రచారం చేస్తారు.
26న రాజోలు, రామచంద్రాపురం, 27న పెద్దాపురం, కాకినాడ, 28న జగ్గంపేట, ప్రత్తిపాడులో ప్రచారం చేస్తారు. 29న తిరుపతి, 30న పోలవరం నియోజకవర్గాల్లో, ఏప్రిల్ 1న యలమంచిలి, పెందుర్తి, 2న విశాఖ దక్షిణం స్థానాల్లో ప్రచారం నిర్వహిస్తారు. 3న నెల్లిమర్ల, పాలకొండ, 4న తుని, పిఠాపురం, 5న గుడివాడ, పామర్రు, 6న రేపల్లె, అవనిగడ్డ, 7న గన్నవరం, పెనమలూరు ప్రచారసభల్లో పాల్గొంటారు. 10న పిఠాపరంలో రోడ్డు షోలో పాల్గొని ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. చివరి రోజు 11న కాకినాడ గ్రామీణంలో రోడ్డు షోలో పాల్గొంటారు.