
Pawan Kalyan
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 69,169 ఓట్ల తేడాతో రికార్డు విజయం నెలకొల్పారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి విజయం సాధించారు. మరో వైపు, 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన దాదాపు అన్ని సీట్లను గెలుచుకునే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు జనసేన ఏడు సీట్లు గెలుచుకోగా.. 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
రాష్ట్రంలో 175కు 162 అసెంబ్లీ స్థానాల్లో కూటమి ఆధిక్యంలో దూసుకుపోతోంది. దీంతో కూటమి విజయం ఖాయమైంది. ఇక, జనసేన పోటీ చేసిన 21 స్థానాలకు 21 సీట్లలో గెలుపు దిశగా పయనిస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం 1 సీట్లలోనే ముందంజలో కొనసాగుతోంది.