Pawan kalyan : యూట్యూబ్ రికార్డ్స్ లో ఇక ఎవరైనా ‘నాన్ పవన్ కళ్యాణ్’ రికార్డ్స్ అని చెప్పుకోవాల్సిందేనా?
Pawan kalyan : యూట్యూబ్ రికార్డ్స్ లో పాన్ ఇండియన్ స్టార్స్ పవన్ కళ్యాణ్ దరిదాపుల్లోకి రాలేకపోతున్నారా అంటే కచ్చితంగా అవుననే చెప్పాలి. ఎందుకంటే టాలీవుడ్ లో అత్యధిక లైక్స్ వచ్చిన గ్లిమ్స్ వీడియో రికార్డు ఆయన ఖాతాలోనే ఉంది. ఆయన హీరో గా నటించిన ‘భీమ్లా నాయక్’ గ్లిమ్స్ వీడియో కి 10 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. అంతే కాదు అదే సినిమా ట్రైలర్ కి కేవలం 24 గంటల్లో 10 లక్షల లైక్స్ వచ్చాయి.
ఇప్పటి వరకు #RRR మరియు ‘సలార్’ చిత్రాల ట్రైలర్స్ కి తప్ప, ఏ ట్రైలర్ కి కూడా 24 గంటల్లో 10 లక్షల లైక్స్ రాలేదు. రీసెంట్ గా వచ్చిన ‘గుంటూరు కారం’ ట్రైలర్ కూడా లైక్స్ విషయం లో ‘భీమ్లా నాయక్’ ట్రైలర్ కి దరిదాపుల్లోకి రాలేకపోయింది. ఇదంతా పక్కన పెడితే 24 గంటల్లో అత్యధిక లైక్స్ ని సాధించిన టాప్ 5 మూవీస్ గ్లిమ్స్ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ వి రెండు సినిమాలు టాప్ 2 లో ఉన్నాయి.
అందులో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ని సాధించిన గ్లిమ్స్ వీడియో గా ‘ఓజీ’ చిత్రం 7 లక్షల 31 వేల లైక్స్ తో టాప్ 1 స్థానం లో ఉండగా, 7 లక్షల 29 వేల లైక్స్ తో ‘భీమ్లా నాయక్’ చిత్రం రెండవ స్థానం లో ఉంది. ‘ఓజీ’ రికార్డు ని బద్దలు కొట్టడమే లక్ష్యంగా రీసెంట్ గా వచ్చిన ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ గ్లిమ్స్ వీడియో ఓజీ రికార్డుకి ఆమడదూరం లో ఆగిపోయింది. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పెద్ద షాక్. 10 రోజుల నుండి సరైన ప్లానింగ్ తో ఓజీ రికార్డుని కొట్టేందుకు అన్నీ విధాలుగా సిద్ధం అయ్యారు, కానీ చివరికి దగ్గర్లోకి కూడా రాలేకపోయారు.
దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ‘ఓజీ’, ‘భీమ్లా నాయక్’ రికార్డ్స్ ని ఎవ్వరూ కొట్టలేరు కానీ, ఆ రెండు సినిమాలను వదిలేసి టాప్ 3 స్థానం కోసం పోటీ పదండి అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. కేవలం గ్లిమ్స్ వీడియోస్ విషయం లో మాత్రమే కాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లైవ్ వ్యూస్ కౌంట్ విషయం లో కూడా పవన్ కళ్యాణ్ కి దరిదాపుల్లో వచ్చిన హీరో మరొకడు లేదు. ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని లైవ్ లో ఒక లక్ష 84 వేల మంది వీక్షించారు. ఈ రికార్డుని #RRR కూడా బ్రేక్ చేయలేకపోవడం గమనార్హం.