Pawan Kalyan Win : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలతాలపై జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి. పిఠాపురం, హిందూపురం, పులివెందుల, కుప్పం, మంగళగిరి లాంటి చోట్ల ఎవరూ గెలుస్తారు.. ఎవరూ ఓడిపోతారోనని బెట్టింగులు కడుతున్నారు. గత సారి బెట్టింగ్ రాయుళ్లు కన్ను మంగళగిరి మీద ఉండగా.. ఈ సారి పిఠాపురంపై పడింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ఎంపీ వంగ గీత ఇక్కడి నుంచి పవన్ కల్యాణ్ కు గట్టి పోటీనిస్తోంది.
ఈ నియోజకవర్గంపై తెలుగు మీడియాతో పాటు, జాతీయ మీడియా సైతం పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. 2019 లో జరిగిన ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు. ఓటర్లను తక్కువ అంచనా వేసి గాజువాక, భీమవరంలో ఓడిపోయి కంగు తిన్నారు. దీంతో ఈ సారి ఎన్నికల కోసం ఎక్కడ కూడా రాజీ పడలేదు. పక్కా ప్రణాళిక తో ముందుకు సాగి కూటమి తరఫున అభ్యర్థిగా ఎన్నికల గోదాలోకి దిగాడు. దీంతో పవన్ కల్యాణ్ పక్కా గెలుస్తాడని టీడీపీ, జనసేన నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
దీన్నే అదనుగా చూసుకుని బెట్టింగ్ రాయుళ్లు ఎక్కువగా పందేలు కాస్తున్నారు. పవన్ కల్యాణ్ గెలవడని లక్షకు 5 లక్షలు ఇస్తామంటూ బెట్టింగ్ లు వేసుకుంటున్నారు. ప్రస్తుతం పిఠాపురం ఫలితాలపై కోట్ల రూపాయలు చేతులు మారనున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ను గెలిపించేందుకు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, రాంచరణ్, అదిరే అభి, ఆది, సుడిగాలి సుధీర్ లాంటి ఎంతో మంది నటీ నటులు ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
వైసీపీని గద్దె దించేందుకు కూటమి కట్టి గట్టి పోటీ కూడా ఇచ్చినట్లు అర్థమవుతుంది. ఈ సందర్భంగా కొన్ని ప్రముఖ అసెంబ్లీ సీట్లపైనే పందెం రాయుళ్లు బెట్టు వేస్తున్నారు. చంద్రబాబు, జగన్, లోకేశ్, పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న ప్రాంతాల్లో గెలుపెవరిది ఎవరూ ఓడతారంటూ కోట్లల్లో బెట్టింగ్ వేస్తున్నట్లు సమాచారం. భారీ మెజార్టీ పవన్ కల్యాణ్ వస్తుందని లక్ష రూపాయలు బెట్టింగ్ కడుతున్నారు. కొంతమంది సాధారణ మెజార్టీ మాత్రమే వస్తుందని, చాలా తక్కువ మంది ఓడిపోతారని బెట్టింగ్ వేసుకుంటున్నారు. ఇలా బెట్టింగ్ వేసుకుంటున్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో బెట్టింగ్ ల జోరు అందరికీ తెలిసిపోయింది.