JAISW News Telugu

Doctorate Award : గౌరవ ‘డాక్టరేట్’ పురస్కారాన్ని తిరస్కరించిన పవన్ కళ్యాణ్..ఈయన చర్యలు ఊహాతీతం!

Doctorate Award

Doctorate Award refused Pawan Kalyan

Doctorate Award Refused Pawan Kalyan : పవన్ కళ్యాణ్ చర్యలు ఊహాతీతం అని ఒక డైరెక్టర్ అంటాడు..అందులో ఆంతర్యం ఏమిటో అప్పట్లో అభిమానులకు అర్థం అయ్యేది కాదు. కానీ ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. అనితర సాధ్యమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ కూడా ఆయన ఏనాడు క్రేజీ కాంబినేషన్స్ తో సినిమాలు చెయ్యాలని అనుకోలేదు. తన మనసుకి నచ్చిన వాళ్ళతోనే సినిమాలు చేసుకున్నాడు, కోట్లాది మంది ఫ్యాన్స్ ని తన సొంత నిర్ణయాలతోనే సంపాదించుకున్నాడు.

ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ రేంజ్ ఫ్యాన్ బేస్ ఉన్నోడు రెగ్యులర్ పాలిటిక్స్ చేస్తాడు. డబ్బు పెట్టేవాళ్ళని పార్టీలోకి ఆహ్వానించి అధికారమే లక్ష్యంగా పరుగులు తీస్తారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నీతి, నిజాయితీ, స్వచ్ఛమైన రాజకీయాలు చెయ్యాలని సామాన్యులను లీడర్స్ గా మలిచే కార్యక్రమం తలపెట్టాడు. పదేళ్ల నుండి పొలిటికల్ గా సక్సెస్ లేకపోయినా కూడా ఇప్పటికీ తాను నమ్ముకున్న సిద్ధాంతం తోనే ముందుకు పోతున్నాడు. నేడు ఆంధ్ర రాష్ట్రమంతటా రాబోతున్నాడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం అని నినదించేలా రాజకీయంగా ఎదిగాడు.

అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ సుదీర్ఘ ప్రస్థానం ఉంది కాబట్టే, ఆయనకి చెన్నై లోని వేల్ యూనివర్సిటీ ‘డాక్టరేట్’ పురస్కారం ఇచ్చి సత్కరించాలని అనుకుంది. అందుకోసం త్వరలోనే నిర్వహించేబోయే ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ని ఆహ్వానిస్తూ, అదే రోజున డాక్టరేట్ ప్రధానం చేయబోతున్నట్టు పవన్ కళ్యాణ్ కి లేఖ రాసింది వేల్ యూనివర్సిటీ. దీనిని పవన్ కళ్యాణ్ చాలా సున్నితంగా రిజెక్ట్ చేసాడు.

ఆయన మాట్లాడుతూ ‘నాకు డాక్టరేట్ ఇవ్వాలని అనుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా సేవలను మీరు గుర్తించినందుకు ధన్యవాదములు. కానీ నాకంటే ఈ సమాజం లో సేవలు అందించిన వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్లకి ఇంకా ఈ గౌరవ డాక్టరేట్ దక్కలేదు. అలాంటి దిగ్గజాలకు దక్కనప్పుడు, నేను ఈ గౌరవం ని స్వీకరించడంలో అర్థం లేదు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పొలిటికల్ షెడ్యూల్స్ వల్ల నేను ఈవెంట్ కి కూడా హాజరు కాలేకపోతున్నాను, దయచేసి నన్ను పెద్ద మనసు చేసుకొని క్షమించండి’ అంటూ పవన్ కళ్యాణ్ ఒక లేఖ రాసాడు.

దీనిపై కొంతమంది అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లక్షల మందిలో ఒకరికి దక్కే అరుదైన గౌరవం ఇది, ఎవరైనా ఈ గౌరవం దక్కినప్పుడు కళ్ళకు అద్దుకొని మరీ తీసుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు రిజెక్ట్ చేసాడు?, ఇంత మంచి తనం అసలు పనికి రాదు అంటూ అభిమానులు సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు.

Exit mobile version