JAISW News Telugu

Pawan Kalyan : తీవ్ర భావోద్వేగానికి లోనైన పవన్ కళ్యాణ్.. ఎందుకంటే?

Pawan Kalyan

Pawan Kalyan in Ayodhya

Pawan Kalyan : అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆలయంలో ముందు వరుసలో కూర్చొని భక్తి కార్యక్రమాలను వీక్షించారు. ఈ వేడుక అనంతరం పవన్ కళ్యాణ్ ఒక మీడియాలో తన అనుభవాన్ని పంచుకోమని కోరగా తాను చాలా భావోద్వేగానికి గురయ్యానని సమాధానమిచ్చాడు.

‘వ్యక్తిగతంగా ఈ రోజు నాకు చాలా ఎమోషనల్ జర్నీ. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇది భారత్ ను ప్రపంచ పటంలో మరింత బలోపేతం చేస్తుంది, దీంతో పాటు మరియు ఏకీకృతం చేసింది. నేను నిజంగా భావోద్వేగానికి గురయ్యాను కాబట్టి ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను’ అని పవన్ తనను ఇంటర్వ్యూ చేసిన ఒక జాతీయ మీడియా సంస్థతో అన్నారు.

అయోధ్య మందిరం ముందు ఆధ్యాత్మిక కోణంలో ఉన్న ఫొటోను కూడా పవన్ కళ్యాణ్ షేర్ చేశారు. భారతీయుల 500 ఏళ్ల కల ఎట్టకేలకు నెరవేరిందన్నారు. నేడు బాల రాముడిగా కొలువైన శ్రీ రాముడు. ముందు రోజుల్లో జనకీ, లక్ష్మణ సమేతుడిగా దర్శనం ఇవ్వబోతారని చెప్పారు. ప్రపంచం యావత్తు ఈ వేడుకను అత్యంత ఆసక్తితో తిలికించింది.

దివ్య, భవ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను దూర్‌దర్శన్ 4K క్లారిటీతో అందించాయి. దీంతో భక్తులు అయోధ్యలోనే ఉన్నారన్న ఫీలింగ్ కలిగిందని చెప్పుకుంటున్నారు. ప్రతీ ఇల్లూ, వీధి, పట్టణం మొత్తం రామ నాయ స్మరంతో మార్మోగాయి. దేశ వ్యాప్తంగా రామాలయంలో ప్రత్యేక పూజలు, సీతారామ చంద్రస్వామి కల్యాణం నిర్వహించి ఆనందంగా గడిపారు.

Exit mobile version