Pawan Kalyan : ‘ఓజీ’ కోసం మరోసారి సింగర్ గా మారిన పవన్ కళ్యాణ్..ఫ్యాన్స్ కి ఇక పండగే!
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాలలో అభిమానులతో పాటుగా, ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్న చిత్రం ‘ఓజీ’. సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా 70 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. పవన్ కళ్యాణ్ గత కొంతకాలం గా రాజకీయాల్లో బిజీ అవ్వడం తో ఎన్నికలు పూర్తి అయ్యేవరకు సినిమా షూటింగ్స్ లో పాల్గొనకూడదు అని నిర్ణయించుకున్నాడు.
ఏప్రిల్ నెలాఖరున కానీ, లేదా మే నెలలో కానీ షూటింగ్ మళ్ళీ తిరిగి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని గత ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా విడుదల చెయ్యగా దానికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ని తాము ఎలా అయితే చూడాలని కోరుకుతున్నామో, ఆలా చూపిస్తున్నందుకు డైరెక్టర్ సుజిత్ కి ధన్యవాదాలు అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్ని సార్లు సోషల్ మీడియా లో సుజిత్ కి చెప్పి ఉంటారో లెక్కే లేదు.
ఇకపోతే ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా థమన్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్లిమ్స్ వీడియో ద్వారా ఆయన ఇచ్చిన ‘హుంగ్రీ చీటా’ ఆడియో ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యిందో మనమంతా చూసాము. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈ ఆడియో నే వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కేవలం సినీ హీరో మాత్రమే కాదు, గొప్ప సింగర్ కూడా. ఇప్పటి వరకు ఆయన ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడాడు కూడా. అయితే ఎక్కువ జానపదం, తెలంగాణ, శ్రీకాకుళం యాసలోనే పవన్ కళ్యాణ్ పాటలు పాడుతూ వచ్చాడు. రీసెంట్ గా థమన్ స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే సూపర్ సింగర్స్ ప్రోగ్రాం కి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
ఈ సందర్భంగా ఆయన్ని యాంకర్ శ్రీముఖి ‘పవన్ కళ్యాణ్ గారితో ఓజీ చిత్రం లో పాట పాడించే అవకాశం ఉందా’ అని అడగగా, దానికి థమన్ సమాధానం చెప్తూ ‘ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ గారు పాడగలిగే సాంగ్స్ చాలానే ఉన్నాయి. ప్లాన్ చేస్తున్నాం, ఆయన ఒప్పుకొని పాడుతాడు అనే అనుకుంటున్నాం’ అని చెప్పుకొచ్చాడు థమన్. పవన్ కళ్యాణ్ కి ఇప్పటి వరకు థమన్ అందించిన మ్యూజిక్ ప్రతీ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్టే, ఈ సినిమా కూడా ఆ రేంజ్ లో హిట్ అవుతుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్.