Pawan Kalyan : కేంద్రమంత్రివర్గంలోకి పవన్ కళ్యాణ్.. ఏపీలో బీజేపీ పెద్ద వ్యూహం
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పెద్ద వ్యూహాలు రచిస్తోంది. వైసీపీ స్థానంలోకి ఆక్రమించి బలంగా తయారవ్వాలని.. పవన్ కళ్యాణ్ ను తూరుపుముక్కగా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు కాకపోతే…ఇంకెపుడు బలపడుతామనే ఆలోచనలో కాషాయ పార్టీ నేతలు ఉన్నారు. 2029 నాటికి బలమైన పార్టీగా అవతరించడానికి కమలం పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారా ? అందులో భాగంగానే పవన్ కల్యాణ్‌కు కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోనున్నరా? అంటే ఔననే సమాధానం వస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో బలపడటమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి 175 స్థానాల్లో పోటీ చేసేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తెలుగుదేశం పార్టీపై ఎక్కువకాలం ఆధారపడితే..మనకే నష్టమనే ఆలోచనలో పడిపోయింది. అందులో భాగంగానే 2029 అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలంగా తయారు చేయాలన్న టార్గెట్‌గా పని చేస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఢిల్లీకి రావాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
పవన్ కల్యాణ్‌ను రాజ్యసభకు పంపేలా మంత్రాంగం నడుపుతోంది. వైసీపీ తరపున ఎన్నికైన విజయసాయిరెడ్డి…రెండ్రోజుల క్రితం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కర్ ఆమోదించారు. ఆయన దారిలోని మరికొందరు ఎంపీలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీని పూర్తి వీక్ చేయాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన స్థానంలో పవన్ కల్యాణ్‌ను పెద్దల సభకు పంపేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. దీనిపై ఇప్పటికే సంప్రదింపులు పూర్తయినట్లు తెలుస్తోంది. వైసీపీలోని అసంతృప్త నేతలను చేర్చుకొని బలపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
పవన్ కల్యాణ్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొని…ఏపీలో డిప్యూటీ సీఎం పదవి తాను తీసుకోవాలనే వ్యూహంలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పవన్ కల్యాణ్‌కు ఢిల్లీకి రావాలని కబురు పంపినట్లు తెలుస్తోంది. 2029లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేసేలా…కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా వైసీపీని వీక్ చేసి…ఆ స్థానంలోకి బీజేపీ-జనసేన వెళ్లాలని చూస్తున్నాయి. అందుకే పవన్ ద్వారా తెరవెనుక రాజకీయం ప్రారంభించింది బీజేపీ అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..