Pawan Kalyan swearing : బాహుబలికి మించిన రేంజ్ లో పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం..ఫ్యాన్స్ కు గూస్ బంప్స్

Pawan Kalyan swearing
Pawan Kalyan swearing : ఏపీ రాజధాని అమరావతిలో ఇవాళ దసరా, సంక్రాంతి పండుగలను మించిన ఆనందం వెల్లివిరిసింది. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు కేరింతల మధ్య చంద్రబాబు, ఆయన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణ స్వీకార వేడుకలో జనసైనికుల సందడి అంతా ఇంతా కాదు. పవన్ ఇవాళ తొలిసారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఫ్యాన్స్ గూస్ బంప్స్ వచ్చాయనే చెప్పాలి. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో అభిమానులు, జనసైనికులు హోరెత్తించారు.
సినిమా ఈవెంట్లలోనే పవన్ ఫ్యాన్స్ సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే వారి సంబరం అంబరాన్నంటింది. పవన్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే జనసైనికులు, ఫ్యాన్స్ మాత్రమే కాదు అటు టీడీపీ, బీజేపీ శ్రేణులు కూడా కేరింతలు, చప్పట్లతో హోరెత్తించడంతో ప్రాంగణం దద్దరిల్లిపోయింది. అక్కడ చూస్తుంటే బాహుబలి సీన్ కు మించి ఉండడంతో ఫ్యాన్స్ కు ఆనందంతో ఉప్పొంగిపోయారు.
వాస్తవానికి అది సినిమా కాబట్టి అంతా మాయాలోకం. కానీ వాస్తవ జీవితంలో పవన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని చూసిన అభిమానులు అందరూ తమ జీవిత కాలం గుర్తుంచుకుంటారు అనడంలో సందేహం లేదు. ఇక పవన్ ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఆయన సతీమణి అన్నా లెజినోవా తన సెల్ ఫోన్ లో వీడియో తీస్తూ సందడి చేశారు. అన్నయ్య మెగాస్టార్ ఆనందంతో అలా పవన్ ను చూస్తుండిపోయారు. మెగా ఫ్యామిలీకి ఈ సందర్భం కలకాలం ఓ మెమొరియబుల్ ఈవెంట్ గా ఉండిపోనుంది. ఇక ఇప్పటికే పవన్ ప్రమాణ స్వీకార ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.